“దగా.. దగా.. మోసం. నమ్మించి.. నమ్మించి.. వెన్నుపోటు పొడిచారు. ఊరించి.. ఊరించి.. ఉసూరుమనిపించారు” అంటూ జనసైనికులు విషాదగీతాలు పాడుకుంటున్నారంట. కొబ్బరి చెట్ల కింద కూర్చుని చల్లని బీర్లు ఓపెన్ చేసుకున్నా.. పొగలు కక్కుతున కోపం చల్లారడంలేదని మరికొందరు వాపోతున్నారంట! ఈ పరిస్థితికి కారణం తాజాగా పవన్ పెట్టిన ప్రెస్ మీట్.. చంద్రబాబుకు అన్ కండీషనల్ గా లొంగిపోయిన అంశం కారణం కాదంట… అంతకు మించిన కారణం మరొకటుందని చెబుతున్నారంట!
ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా జనసైనికులు.. మరి ముఖ్యంగా గోదావరి జిల్లాల పవన్ అభిమానులు రాత్రి నుంచి తెగ ఫైరైపోతున్నారంట. వారి ఆగ్రహాన్ని ఫోన్ లపైనా, అద్దాల పైనా చూపిస్తున్నారని తెలుస్తుంది. ఇంకొంతమందైతే మందేసి మరిచిపోదామని ప్రయత్నించి విఫలమవుతున్నారంట! దీనంతటికీ కారణం… ఈమధ్య కాలంలో నాగబాబు పెట్టిన ట్వీట్లు అని క్లారిటీ ఇస్తున్నారంట. గుడ్డిగా నమ్మిన జనసైనికులను ఇంతలా వంచిస్తారా అని ఆవేదన వ్యకం చేస్తున్నారంట!
సరిగ్గా వారం రోజుల క్రితం నాగబాబు ఒక ట్వీట్ చేశారు. “తిరుమల తిరుపతి దేవస్థానం స్వయం ప్రతిపత్తి పాలన గురించి బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. జనసేన ప్రభుత్వ పాలనలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా టీటీడీ ధర్మకర్తల మండలి, హిందూ ధార్మిక సంస్థలు, అత్యధిక మంది భక్తుల అభిప్రాయాలను సేకరిస్తాం. ఇంతకాలం కాగితాలకే పరిమితమైన స్వయం ప్రతిపత్తి అనేది ఎలా ఉంటుందో ఆచరణలో చేసి చూపిస్తాం” అని నాగబాబు ట్వీట్ చేశారు.
అంటే వారం రోజుల క్రితం కూడా… “జనసేన ప్రభుత్వం”, “పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి”… వంటి మాటలు మాట్లాడారని.. ఇంతలోనే అలాంటివి ఏమీలేదని చెబుతున్నారని వాపోతున్నారంట. ఇదే క్రమంలో… “పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే స్వర్ణ యుగం వస్తుంది” అని… “జనసేన పాలనలో గంజాయిని నిర్మూలిస్తాం” అని… ఇల వరుసపెట్టి వారం క్రితం కూడా ఇలా వంచన ట్వీట్లు పెట్టారని తెగ ఫీలయిపోతున్నారంట.
ఇలా తమ భవిష్యత్తుని, తమ నమ్మకాన్ని, తమ అభిమనాన్ని, తమ త్యాగాలనూ గంపగుత్తగా చంద్రబాబు పాదాల దగ్గర పరుస్తారన్న విషయం… నాగబాబుకి ఎప్పుడో తెలిసినా కూడా… ఇంతకాలం నాటకాలాడుతూ, సొంత తమ్ముళ్ల కంటే ఎక్కువైన జనసైనికులను ఒక ప్లాన్ ప్రకారం వంచించారని వాపోతున్నారంట. ఫలితంగా… ఇంతకాలం జన”సైనికులు” జన”సైనికులు” అని చెప్పి… ఆఖరికి ఇలా చంద్రబాబు సైకిల్ కి “వాచ్ మేన్” లను చేశారంటూ చెమటతో కలిసి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటున్నారంట!