జనసైనికుల్లో అయోమయం.! ఇదేం రాజకీయం పవనన్నా.!

జనసేన సానుభూతి పరుడిగా నిన్న మొన్నటివరకూ కనిపించిన మహాసేన రాజేష్ టీడీపీలోకి వెళ్ళిపోగా, జనసేన వైపు వెళతారనుకున్న మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ కూడా టీడీపీ వైపే చూస్తున్నారు. దాంతో, జనసైనికుల్లో కొంత అయోమయం కనిపిస్తోంది.

జనసేన తరఫున ఎవరైనా పాజిటివ్‌గా మాట్లాడితే చాలు, వారికి విపరీతమైన ఎలివేషన్లు ఇవ్వడం జనసైనికులకి అలవాటే. అదే ఇప్పుడు కొంప ముంచుతోంది. ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని జనసేనాని చేసిన వ్యాఖ్యల్లో ఆంతర్యమేంటో జనసైనికులకి ఇప్పటికీ అర్థం కావడంలేదు.

జనసేనకు బలమవుతారనుకున్న కన్నా లక్ష్మినారాయణ టీడీపీలోకి వెళ్ళే ప్రయత్నం చేయడమేంటి.? ఈ ప్రశ్న చుట్టూ జనసైనికుల్లో అంతర్మధనం నడుస్తోందిట. జుట్టు పీక్కుంటున్నా.. వాళ్ళకి సమాధానం అయితే దొరకడంలేదు.

‘అసలు జనసేన పార్టీ తరఫున 2024 ఎన్నికల్లో ఎవరెవరు బరిలో వుంటారు.? ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుంది.? జనసేన అసలు పోటీలో వుంటుందా.? వుండదా.?’ అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయిప్పుడు