జనసేన ట్రాప్‌లో ఇరుక్కుంటున్న వైసీపీ.!

జనసేనది ఏముంది.? ఓ నాలుగైదు సీట్లు గెలుచుకున్నా.. ఆ పార్టీకి అది పెద్ద బోనస్ అవుతుంది.! అధికార వైసీపీకి అలా కాదు.! వై నాట్ 175 అని ప్రకటించేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బొటాబొటి మెజార్టీతో అధికారం తెచ్చుకుంటే సరిపోదు.. గట్టిగానే కొట్టాలి.! సర్వేల అంచనాలేమో, వైసీపీకి అంత సానుకూలంగా కనిపించడంలేదు.

పెయిడ్ సర్వేల్ని పట్టుకుని ‘సిద్ధం’ అంటూ బహిరంగ సభలు నిర్వహించి, చంద్రముఖి, టీ.. అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ టైమ్ పాస్ చేస్తే, వైసీపీకి ముందు ముందు కష్టకాలమే. గట్టిగా నిలబడాలి.. ఎంతగట్టిగా అంటే, 2019 ఎన్నికల కంటే గట్టిగా నిలబడాల్సి వుంటుంది వైసీపీ.!

2019 నాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. సంక్షేమ పథకాల అమలు వ్యవహారం పక్కన పెడితే, అభివృద్ధి జీరో.! ఖచ్చితంగా ప్రజలు ఈ అభివృద్ధినీ ఓటేసేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటారు.

జనసేన – టీడీపీ కాంబినేషన్ ఏమాత్రం వర్కవుట్ అయినా, వైసీపీ ఉనికికే ప్రమాదం ఏర్పడొచ్చు. ఇప్పటికే వైఎస్ జగన్ తన ప్రధాన బలాన్ని కోల్పోతూ వస్తున్నారు. తల్లి విజయమ్మ మౌనం దాల్చారు, చెల్లెలు షర్మిల దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో జగన్ ముందడుగు వేసేది ఎలా.?

మంత్రి అంబటి రాంబాబు సహా, చాలామంది వైసీపీ మంత్రులు.. పార్టీని గెలిపించే స్థాయి వున్నోళ్ళు కాదు.! ఆ స్థాయి లేనోళ్ళు మీడియా ముందుకొచ్చి టైమ్ పాస్ విమర్శలు రాజకీయ ప్రత్యర్థుల మీద చేస్తున్నారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నారు.

ఇదంతా జనసేనాని ట్రాప్.. దాంట్లో తేలిగ్గానే వైసీపీ పడిపోతోంది.! ‘నీ చెల్లిని తిట్టిస్తున్నావ్.. నువ్వేం మనిషివి జగన్.?’ అన్న జనసేనాని ప్రశ్న, జనంలోకి బలంగా వెళ్ళిపోయింది. వున్నపళంగా వైఎస్ జగన్ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టాల్సిందే.. వేరే దారి లేదు.!