పవన్ పెద్ద రిస్క్ చేసినట్లే… సేఫ్ జోన్ ప్లీజ్!

వారాహి యాత్ర మొదలవ్వడానికి ముందు వరకూ గోదావరి జిల్లాల్లో రాజకీయాలు ఒకలా ఉంటే… ఈ యాత్ర తూర్పుగోదావరిజిల్లాలో నేటితో ముగుస్తున్నప్పటికి మరోలా మారిపోయింది. దీంతో ఎన్నో హోప్స్ పెట్టుకున్న జనసైనికులు తలలుపట్టుకున్నారని తెలుస్తుంది.

అవును… వారాహి యాత్ర మొదలైన కొత్తలో పవన్ కల్యాణ్ ఈసారి తూర్పుగోదావరి జిల్లాలోనే పోటీచేస్తారని అంతా భావించారు. ఇదే సమయంలో వారి భావనకు బలం చేకూరుస్తూ…. పవన్ కూడా పిఠాపురంలోనే ఇల్లు, ఆఫీసు వంటి కామెంట్లు చేశారు. దీంతో ఈసారి పవన్ పిఠాపురం నుంచి పోటీచేయబోతున్నారంటూ జనసైనికులు సందడి చేశారు.

అయితే ఈలోపు ఇటు పిఠాపురం, అటు ప్రత్తిపాడు, అటు కాకినాడల్లో మైకందుకున్న పవన్ చెలరేగిపోయారు. వైసీపీ నేతలతోపాటు కీలకమైన కాపునేతలపైనా అవాకులూ చేవాకులూ పేలారు! దీంతో కాపు సామాజికవర్గంలో కొత్త అలజడి నెలకొంది. దీనికి తగ్గట్లుగా కాకినాడ నుంచి తనపై పోటీచేయాలని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. పవన్ కు ఛాలెంజ్ విసిరారు.

అనంతరం తనపై పిఠాపురంనుంచి పోటీచేయాలని తనను ఛాలెంజ్ చేయాలంటూ ముద్రగడ… పవన్ కు తనదైన శైలిలో సూచించారు. దీంతో… పవన్ పూర్తిగా నమ్ముకున్న కాపుఓట్లలో చీలిక వచ్చేసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. దీంతో… ఈసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా కష్టమేనా అనే కామెంట్లు మొదలైపోయాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ద్వారంపూడి అయినా ముద్రగడ అయినా ఓటమెరుగని నేతలేమీ కాదు. మూడుసార్లు పోటీచేసిన ద్వారంపూడి ఒకసారి ఓడిపోయారు. నాలుగుసార్లు పోటీచేసిన ముద్రగడ ఒకసారి ఓడిపోయారు. అయితే ఈ మధ్య వారిద్దరూ మరింత బలమైన నేతలుగా మారిపోయారు. పైగా ఇద్దరూ కాపుసామాజికవర్గానికి బాగా కావాల్సిన నేతలుగా పేరుతెచ్చుకున్నారు. ఫలితంగా… కాపు ఓట్లలో చీలిక కన్ ఫాం అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇప్పుడు ఇదే జనసైనికులను ఆందోళనలో పాడేసింది. ఫలితంగా… ఇక పవన్ కు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో మరో సేఫ్ ప్లేస్ లేదనే చర్చ మొదలైది. కారణం… పవన్ పర్యటిస్తున్న నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ మినహా… మిగిలిన ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలు రిజర్వేడ్ స్థానాలు. సో… పవన్ కు అక్కడ ఛాన్స్ లేదు!

మరి ఈసారికి తూర్పుగోదావరి జిల్లాను పక్కనపెట్టి… పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు లలో పవన్ అదృష్టాన్ని పరీక్షించుకుంటారా.. లేక, మరోసారి భీమవరం వైపు చూస్తారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా… ఒక పార్టీ అధ్యక్షుడికి తాను పోటీచేయబోయే నియోజకవర్గంపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం కాస్త విచారించవలసిన విషయమే అనేది పరిశీలకుల మాటగా ఉంది.