టీడీపీ చేస్తోన్న ‘అతి’పై జనసేనాని పవన్ కళ్యాణ్ గుస్సా.!

తెలుగు దేశం పార్టీ నడిపే రాజకీయాలు ఎలా వుంటాయో ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రుచి చూసేశారు. 2014 ఎన్నికల్లో జనసేన పార్టీని బాగా వాడేసుకుంది టీడీపీ. 2019 ఎన్నికల్లో కూడా జనసేన పార్టీని అనధికారికంగా వాడేసుకుంది. రెండు సార్లూ జనసేన పార్టీనే ఇబ్బంది పడింది.

అయితే, రెండోసారి జనసేన పార్టీ కూడా టీడీపీని గట్టిగానే కొట్టింది. ఆ దెబ్బకి టీడీపీ ఇంకా కోలుకోలేదు. అయినాగానీ, జనసేన మీదకు టీడీపీ వలపు బాణాల్ని విసురుతూనే వుంది. ఒకప్పటి జనసేనకీ, ఇప్పుడున్న జనసేనకీ చాలా తేడా. టీడీపీకి రీసౌండ్ వచ్చేలా స్ట్రోక్ ఇస్తున్నారు జనసేన నేతలు.

తాజాగా, జనసేన పార్టీకి కేవలం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్ని, రెండు లోక్ సభ నియోజకవర్గాల్ని పొత్తులో భాగంగా కేటాయిస్తామంటూ టీడీపీ నేత కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలు, జనసేన పార్టీకి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్దకు కూడా ఈ విషయం వెళ్ళిందట. ‘వాళ్ళెవరు మనకి ఇవ్వడానికి.? మనమే ఇంకొకరికి ఇచ్చే స్థాయిలో వున్నాం..’ అని జనసేనాని, జనసేన నేతల సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

‘ప్రభుత్వం మారాలి.. అంటే, వైసీపీ దిగిపోవాలి. ఈ క్రమంలో రాజకీయంగా బలపడేందుకు వున్న అవకాశాల గురించి ఆలోచిస్తున్నాం. టీడీపీతో కలవడం, కలవకపోవడం అన్నది ఎన్నికల సమయంలో తేలుతుంది. ప్రస్తుతానికైతే వైసీపీ, టీడీపీలతో సమదూరం పాటిస్తున్నాం..’ అని జనసేనాని స్పష్టతనిచ్చారట.

టీడీపీ విసురుతోన్న వల విషయమై అప్రమత్తంగా వుండాలనీ జనసేనాని, జనసేన నేతలకు సూచించారని సమాచారం. ‘టీడీపీ చేసే వెకిలి వ్యాఖ్యలకు కౌంటర్ గట్టిగానే ఇవ్వాలి..’ అని కూడా జనసేనాని స్పష్టం చేశారట.