జనసేనలో టిక్కెట్లు దాదాపు ఖాయమైపోతున్నాయ్.!

ఫలానా నియోజకవర్గంలో పలానా వ్యక్తికి టిక్కెట్ కన్ఫామ్ అయ్యిందట కదా.? జనసైనికుల్లో జరుగుతున్న చర్చ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80కి పైగా నియోజకవర్గాల్లో జనసైనికులు, ఇప్పటికే అనధికారికంగా ఖరారైన నాయకులకు సంబంధించి గ్రౌండ్ లెవల్‌లో ప్రచార కార్యక్రమాలు హోరెత్తించేస్తున్నారట.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ఈ మధ్య ఆశావహులు వరుసగా భేటీలు అవుతున్నారు. జనసేన అధినేతతోనే నేరుగా వన్ టు వన్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయా నేతలకు జనసేన అధినేత స్పష్టమైన మాట ఇచ్చేస్తున్నారట.

‘స్పష్టమైన మాట’ అంటే, ఇక్కడ మళ్ళీ కండిషన్స్ అప్లయ్.. అని అంటున్నారు. ఒకవేళ టీడీపీతో పొత్తులు వుంటే, ఆ పొత్తుల ప్రకారం సీట్లు ఖరారవడం ఆధారపడి వుంటుందన్నమాట.

పవన్ కళ్యాణ్ దగ్గర నాయకులు కన్ఫర్మేషన్ తీసుకుంటోంటే, జనసైనికులేమో.. జనసేన కీలక నేత నాగబాబు దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌ని ఏయే నాయకులు కలవాలి.? అన్నదానిపై నాదెండ్ల మనోహర్ తెరవెనుకాల కథ నడిపిస్తున్నారట.

సాధారణ ప్రచార కార్యక్రమాలే చేపట్టండి.. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసేసి, ఆ తర్వాత అనవసర ఆరోపణలు చేయొద్దనీ ఆయా నాయకులకు సూచిస్తోందిట జనసేన అధినాయకత్వం.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే ఇరవై మందికి పైగా నాయకులు జనసేన అధినేత నుంచి ‘మాట’ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.