Janasena: బీజేపీలోకి జనసేన విలీనం..అదే కారణమా?

Janasena: ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం జనసేన ఈ మూడు పార్టీలు కలిసి గత ఎన్నికలలో పోటీ చేస్తే అద్భుతమైన విజయాన్ని సాధించాయి తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పాలి పవన్ కళ్యాణ్ స్వయంగా మోడీని పొత్తుకు ఒప్పించారు. దీంతో మోడీ పవన్ మధ్య ఎంత సఖ్యత ఉందో ఎన్నో సందర్భాలలో బయటపడింది. అయితే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అతి త్వరలోనే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ బిజెపిలోకి విలీనం చేయబోతున్నారు అంటూ సంచలన వార్త వైరల్ అవుతుంది. ఈ విషయాన్ని మాజీ అధికారి పీవీఎస్‌ శర్మ ఎక్స్‌వేదికగా ప్రకటించారు. సంక్రాంతి తర్వాత బీజేపీ-జనసేన విలీనమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఇలా పండగ పూట ఈ రెండు పార్టీలు ఏకం కావడం గురించి ఈయన మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు.

ఇలా జనసేన పార్టీని భాజపాలోకి విలీనం చేయడానికి ముహూర్తం కూడా ఖరారు చేశారని తెలుస్తుంది. అయితే ఇలా ఉన్నపలంగా పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని విలీనం చేయడానికి గల కారణమేంటనే విషయాన్ని వస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్న విధంగా ఈయన తన లేఖలో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య సఖ్యత కుదరడం లేదని అందుకే చీలికలు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో తన పార్టీ బాధ్యతలు అన్నింటిని పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుకు అప్పజెప్పబోతున్నట్లు తెలుస్తోంది.పవన్ ఏపీ బీజేపీ చీఫ్‌గా, కేంద్రమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. కాగా పవన్ కేంద్ర మంత్రి కానున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్‌ వ్యూహంలో భాగంగానే నాగబాబును ఏపీ క్యాబినెట్ కి పంపించబోతున్నారని సమాచారం. ఎన్నికల సమయంలో టిక్కెట్లు, సీట్ల సర్దుబాటు సమయంలో తనను బీజేపీ పెద్దలు ఎంపీగా పోటీ చేయాలని సూచించారని పవన్ కల్యాణ్ బహిరంగంగానే ప్రకటించారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి డిప్యూటీ సీఎం అయ్యారు కానీ ఇప్పుడు మాత్రం కేంద్రంలో చక్రం తిప్పడానికి సిద్ధమయ్యారని అందులో భాగంగానే తన పార్టీని కూడా భాజాపాలోకి విలీనం చేయబోతున్నారని సమాచారం.