మహానాడు స్పెషల్: మహానాడులో జనసేన స్పెషల్ అట్రాక్షన్!

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతీ ఏటా నిర్వహించే మహానాడు ఫుల్ జోష్ లో నడుస్తుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతియేటా మహానాడుని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు కూడా ఉండటంతో ఇది మరో స్పెషల్ గా మారింది. అయితే అంతకుమించి మరో స్పెషల్ అట్రాక్షన్ ఈ మహానాడులో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. అదే… జనసేన!

ప్రతీఏటా పసుపుదళంతో మాత్రమే నిండిపోయే మహానాడులో ఈసారి ఎర్ర రంగు కూడా హాట్ టాపిక్ గా మారింది. అవును… ఈసారి మహానాడులో జనసేన ప్రస్థావన కీలకం కాబోతుంది. ఈ మహానాడులో తీర్మానాలు ప్రకటించడం, చంద్రబాబుని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, ఊకదంపుడు ఉపన్యాశాలు, ఎన్టీఆర్ గొప్పతనం గురించి ప్రశంసలు, చంద్రబాబు చాణక్యం గురించి పొగడ్తలు, లోకేష్ టాపిక్… ఇవన్నీ రెగ్యులర్ గా జరిగేవే.

అయితే ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో… ఇప్పుడు కూడా ఈ మహానాడుని అలానే ముగించేస్తే.. ఏమాత్రం ప్రయోజనం ఉండదనేది విశ్లేషకులు చెబుతున్న మాటగా ఉంది. ఈ మహానాడు పూర్తయ్యే లోపు జనసేనతో పొత్తు పై చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాకాకుండా… ఇంకా నాన్చుడు ధోరణి అవలంభించి, జనసేన ప్రస్థావన తీసుకురాకుండానే.. జనసేనతో పొత్తుపై కార్యకర్తలకు క్లారిటీ ఇవ్వకుండానే ముగిస్తే గనుక… కేడర్ లో మరింత కన్ ఫ్యూజన్ నెలకొనే ప్రమాధం ఉందని అంటున్నారు పరిశీలకులు.

పొత్తు గురించి ప్రస్థావించడానికి ఇంతకుమించి గొప్ప వేదిక, గొప్ప సందర్భం ఉండదనేది టీడీపీ సీనియర్లు సైతం సూచిస్తున్నారని తెలుస్తుంది. అయితే చంద్రబాబు మదిలో ఏముందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అలా కాకుండా… పొత్తులపై క్లారిటీ ఇవ్వకుండా… రెగ్యులర్ ప్రసంగాలు, ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమవుతూ… ఆత్మస్తుతి పరనింద లా ముగించేస్తే… బుచ్చయ్య పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే!!