నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుతో హైద్రాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ రోజు నారా లోకేష్ పాదయాత్రలో జనసేన జెండాలు కనిపించాయి. ‘జనసేన కార్యకర్తలను ఉద్దేశించి నారా లోకేష్ ప్రసంగించారు కూడా.!
తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహాలు ఇలాగే వుంటాయి. నిజానికి, నారా లోకేష్ పాదయాత్రలో జనసైనికులెవరూ పాల్గొనలేదు. అసలు టీడీపీ కార్యకర్తలే నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్నారా.? లేదా.? అన్నది పెద్ద డౌటు.
రోజువారీ పేమెంట్లు కాదు, ఏకంగా నెలవారీ పేమెంట్లు ఇచ్చి పెయిడ్ కార్యకర్తల్ని వెంట తిప్పుకుంటున్నారు నారా లోకేష్.. అన్న విమర్శ గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ జెండాల్ని టీడీపీ కార్యకర్తలే నారా లోకేష్ పాదయాత్రలో మోయనప్పుడు, వేరే పార్టీ కార్యకర్తలెందుకు కనిపిస్తారు.?
డబ్బులిచ్చి తెచ్చుకున్న పెయిడ్ కార్యకర్తలతో, జనసేన జెండాలు మోయించి, జనసేన – టీడీపీ మధ్య పొత్తు ఖాయమైపోయిందన్న సంకేతాల్ని టీడీపీ అధినేత చంద్రబాబు పంపుతున్నారన్నమాట. ఈ విషయమై జనసేన పార్టీ గుస్సా అవుతోంది.
వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబుకి కొత్త కాదు. అది పవన్ కళ్యాణ్‌కి తెలియదా.? అంటే, ఏమో చెప్పలేం. అయినాగానీ, ఎందుకు పవన్ కళ్యాణ్, చంద్రబాబుకి అంత స్పేస్ ఇస్తున్నట్లు.?
ఇదిలా వుంటే, టీడీపీ అమలు చేసిన ఈ జెండాల వ్యూహం నేపథ్యంలో జనసేనపై వైసీపీ సెటైర్లకు మరింత బలం చేకూరుతోంది.