వైసీపీకి సంబంధించి కొన్ని అంతర్గత వ్యవహారాలు.. కుమ్ములాటలు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ముందే తెలుస్తున్నాయట.! ఏ నాయకుడు ఎక్కడ అసంతృప్తితో వున్నాడు.? అన్న విషయాల్ని జనసేనానికి వైసీపీకి చెందిన నేతలే చేరవేస్తున్నారట. నిజమేనా.?
విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు విషయంలో సొంత పార్టీకి చెందిన నేతలే.. ఉప్పందించారన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత ఒకరు, తెరవెనుకాల జనసేనకు అన్ని విధాలుగా సమాచారాన్ని లీక్ చేసేస్తున్నారట. ఇది ఉత్త గాసిప్ మాత్రమేనా.? నిజమా.? అన్నదానిపై వైసీపీ తెరవెనుకాల ‘పోస్ట్‌మార్టమ్’ షురూ చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో వున్న అసంతృప్త నేతల సమాచారం మొత్తం జనసేనాని దగ్గర వుందట. దానికి అనుగుణంగా, జనసేనలో ఓ స్పెషల్ టీమ్, ఆయా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ఇంటెలిజెన్స్‌కి సైతం చిక్కకుండా తెరవెనుకాల వ్యవహారాలు చక్కబెట్టబడుతున్నాయట కూడా. చిత్రమేంటంటే, వైసీపీ నేతల్లో కొందరు కబ్జాదారులు వున్నారనీ, ఆ వివరాలూ జనసేనానికి స్వయంగా వైసీపీ నేతలే అందిస్తున్నారన్నది ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్.
అయితే, వైసీపీని డ్యామేజ్ చేయడానికి జనసేన వ్యూహాత్మకంగా ఈ తరహా ఎత్తుగడలకు తెరలేపిందన్నవాదనా లేకపోలేదు. వైసీపీలో ఈ తరహా పుకార్లతో అలజడి సృష్టించగలిగితే, పొలిటికల్‌గా మైలేజ్ వస్తుందని జనసేన భావించడంలో వింతేముంది.?
ఇంతకీ, వైసీపీలో ‘కోవర్టుల’ విషయమై డ్యామేజ్ కంట్రోల్ చేయగల ‘ట్రబుల్ షూటర్లు’ ఎవరబ్బా.?