బాబుకు షాకిచ్చిన బీజేపీ… ఎన్డీఏ భేటీకి జనసేనకు ఆహ్వానం!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకీ మారిపొతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా… ముఖ్యంగా పొత్తుల రాజకీయాలు నిత్యం పొలిటికల్ స్క్రీన్ పై కనిపిస్తూనే ఉంటున్నాయి. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చింది బీజేపీ అధిష్టానం.

అవును… ఈ నెల 18న జరగబోయే ఎన్డీఏ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి జనసేనకు మాత్రమే ఆహ్వానం అందించింది. దీంతో టీడీపీని లైట్ తీసుకుందని అంటున్నారు పరిశీలకులు. అయితే… టీడీపీతో రెండు రాష్ట్రాల్లో పొత్తు ద్వారా తెలంగాణలో తమకు నష్టం జరుగుతోందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.

ఇది కూడా… చంద్రబాబు మిత్రపక్షం కోటాలో కానీ, పాత్ర మిత్రుల కోటాలో కానీ… ఆ సమావేశానికి ఆహ్వానించకపోవడానికి ఒక కారణం అని అంటున్నారు. మరోపక్క… చంద్రబాబుని మరోసారి నమ్మే తప్పు చేయరని.. అదే కారణం అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా… ఇది ఏపీలో టీడీపీకి గట్టి షాకే అని అంటున్నారు పరిశీలకులు.

గతంలో పలుమార్లు టీడీపీ-బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ క్రమంలో అధికారాన్ని కూడా పంచుకున్నాయి. అయితే బీజేపీతో పొత్తు చారిత్రక తప్పిదం అన్న చంద్రబాబు.. మరోసారి వారితో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో… 2014 ఎన్నికల్లో టీడీపీ-బీఇజేపీతో పొత్తులో ఉన్నాయి. అధికారంలోకి వచ్చాయి.

అయితే 2014లో అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత అమిత్ షా – మోడీలపై బాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేయించారు. వాళ్లపై చెప్పులు, రాళ్లు కూడా విసిరించారని అంటుంటారు. దీత్మో… మరోసారి బాబుని నమ్మి మోసపోవద్దని బీజేపీ పెద్దలు భావిస్తున్నారనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.

కాగా… గతంలో ఎన్డీఏ భాగస్వాములుగా ఉండి దూరమైన రాజకీయ పార్టీలతో పాటు, భావ సారూప్యత కలిగిన పార్టీలతో ఈ నెల 18న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి పలు పార్టీలకు ఆహ్వానాలు అందగా… వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీకి ఆహ్వానం అందలేదు.

మరోపక్క ఈనెల 17-18 తేదీల్లో బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుమారు 24 ప్రతిపక్ష పార్టీలు భేటీ కానున్నాయి!