కేసీఆర్ ఘన విజయంపై ప‌వ‌ర్‌స్టార్ స్పందన

తెలంగాణ ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి కొత్త చ‌రిత్ర‌ని సృష్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణా రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో తెరాస క్లీన్ స్వీప్ చేసి…. 88 స్థానాల్లో ఘన విజ‌యం సాధించింది. కేసీఆర్‌కి ప్ర‌ధాని మోదీ స‌హా అగ్ర‌నేత‌లంతా అభినంద‌న‌లు, శుభాకాంక్ష‌లు తెలియచేసారు.

ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ద్వారా అభినందన పూర్వక లేఖను విడుదల చేశారు జనసేనాని. హైద‌రాబాద్‌లో లేక‌పోవ‌డంతో ప్ర‌త్యేకంగా ప్రెస్‌నోట్‌తో త‌న అభినంద‌న‌లను అందించారు. ఈ లేఖను మీరు ఇక్కడ చదవచ్చు.

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన గౌరవనీయులు చంద్రశేఖర్ రావుగారికి నా తరుపున, జనసేన శ్రేణుల తరుపున హృదయపూర్వక శుభాభినందనలు. కేటీఆర్ గారికి మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌నలు తెలుపుతున్నాను. ఈ ఎన్నిక‌ల‌లో అత్య‌ధిక మెజార్టీతో గెలుపొందిన హ‌రీష్ గారికి నా శుభాకాంక్ష‌లు అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ కంగ్రాట్స్ తెలిపారు.