పెరిగిన జనసేన బలం ఎంత.? టీడీపీ, వైసీపీలో కంగారు.!

2019 ఎన్నికలతో పోల్చితే ముమ్మాటికీ జనసేన పార్టీ బలం పెరిగింది. అంతే మరి, 2019 ఎన్నికల కంటే దారుణమైన ఓటమి ఏముంటుంది.? ఆ ఓటమి నుంచి జనసేన ఏమన్నా నేర్చుకుందా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ప్రజలకు ఏదన్నా సమస్య అంటూ వస్తే, ముందుగా జనసేన పార్టీనే గుర్తుకొస్తోంది వాళ్ళకి.. సమస్య పరిష్కారం కోసం జనసేననే ఆశ్రయిస్తున్నారు జనం.

కోవిడ్ పాండమిక్ సమయంలో అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేన పార్టీనే ప్రజలతో వుంది. జనసైనికులు ప్రాణాలకు తెగించి మరీ, కోవిడ్ పాండమిక్ సమయంలో జనాన్ని ఆదుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఈ క్రమంంలో చాలామంది జనసైనికులు కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు కూడా.

వరదలొచ్చినా.. ఇంకో విపత్తు ఏదన్నా వచ్చినా.. ముందుగా జనసైనికులే వుంటున్నారు.. జనాన్ని ఆదుకునేందుకోసం. సరే, రాజకీయ పార్టీగా జనసేన వైఫల్యాలనేది వేరే చర్చ. జనంలోకి మాత్రం జనసేన బలంగా వెళ్ళిపోయింది.

వైసీపీ, టీడీపీలకు ధీుటుగా జనసేన పార్టీ బలం పుంజుకుందని చెప్పలేంగానీ, ఆ రెండు పార్టీల విజయావకాశాల్ని దెబ్బ తీసే స్థాయికి మాత్రం జనసేన ఎదిగింది. ఇదే ఇప్పుడు ఆ రెండు పార్టీల ఆందోళనకీ కారణం. కింది స్థాయిలో జనసేన నేతలెవరు బలంగా వున్నారన్నదానిపై ఆరా తీయడం మొదలెట్టాయి టీడీపీ, వైసీపీ.

ఏ నియోజకవర్గంలో జనసేన మద్దతుదారులెంతమంది.? అన్న దిశగా అధికార వైసీపీ, వాలంటీర్ల ద్వారా సమాచారాన్ని సేకరిస్తోందట. టీడీపీ తనుకున్న సోర్సెస్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తోందని తెలుస్తోంది. ఖచ్చితంగా జనసేనకు 30 నుంచి 40 మధ్య సీట్లు వచ్చే ఎన్నికల్లో వస్తాయన్నది ప్రాథమిక అంచనా.