Jamili Elections:: లోక్ సభ సమావేశాల్లో ఈ రోజు జమిలి ఎన్నికల బిల్లును కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాలే ప్రవేశపెట్టారు అయితే ఈ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేసింది. ఇందుకోసం కేంద్రం 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మరొక బిల్లును కూడా ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఈ ఎన్నికల గురించి అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ఎంపీకీ అవకాశం ఇస్తున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు.. జమిలి ఎన్నికల విధానాన్ని ముక్కకంఠంతో వ్యతిరేకించాయి. ఇక ఎన్ డి ఏ కూటమిలో అతిపెద్ద పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని కూడా స్పీకర్ అడిగి తెలుసుకున్నారు అయితే తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు తెలిపింది.
జెమిలీ న్నికలకు టిడిపి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించినట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సభ దద్దరిల్లింది. టీడీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అలా ఎలా మద్దతు తెలుపుతారని కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదం లో భాగంగా జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టారు.
ఈ ఎన్నికల విధానం కనుక అమలలోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి గతంలో ఈ పద్ధతిలోని ఎన్నికలు జరిగేవని మంత్రులు గుర్తు చేశారు. ఇక జమిలి ఎన్నికలు వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వైకాపా భావిస్తుంది ఇలా 2027వ సంవత్సరంలోనే ఈ ఎన్నికలు కనక జరిగితే తప్పకుండా వైకాపా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ జమిలి ఎన్నికలు జరిగినా 2029వ సంవత్సరంలోనే ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.