Jamili: జమిలి ఎన్నికలపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బాబు… ముందస్తు ఎన్నికలకు సమ్మతమేనా?

Jamili: వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానాన్ని తీసుకువస్తూ ఎంత ప్రభుత్వం జమిలి ఎన్నికలను నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నారు.కేంద్రం వేస్తున్న అడుగులకు అనుగుణంగా 2027లోనే జమిలి ఎన్నికలకు అవకాశం ఉందని తెలుస్తుంది. ఇలా జమిలి ఎన్నికలకు ఏపీ కూటమి ప్రభుత్వం కూడా మద్దతు తెలియజేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా జమిలి ఎన్నికల విధానం గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా జమిలి ఎన్నికల పైన కసరత్తు చేస్తోంది. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు సైతం ప్రవేశ పెడతారనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ ఎన్నికలకు చంద్రబాబు కూడా సిద్ధమే అనే విధంగా చెప్పడంతో ఏపీలో కూడా జమిలి ఎన్నికల గురించి చర్చలు మొదలయ్యాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈయన ఈ ఎన్నికల గురించి మాట్లాడుతూ…దేశంలో జమిలి వచ్చినా రాష్ట్రంలో మాత్రం షెడ్యూల్ ప్రకారం 2029లోనే ఎన్నికలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. జమిలి నిర్వహణ పైన కేంద్రం ఆలోచన ఏంటనేది ఈ పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

జమిలి ముందే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయాల్సి ఉంది. దీంతో, 2029కే కేంద్రం జమిలి నిర్వహణకు మొగ్గు చూపుతోందా లేదా ముందస్తుగానే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం 2029 వరకు రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి వీలు లేదు అనే విధంగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.