తెలంగాణలో ఈ మధ్య జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అధికార తెరాస పార్టీకి వ్యతిరేకంగా వచ్చింది. ఓటమికి అయినా విజయానికి అయినా అనేక కారణాలు ఉంటాయి. ఆ ఎన్నికల్లోకేవలం కెసిఆర్ అతి విశ్వాసమే ఆ పార్టీ కొంప ముంచింది. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి కెసిఆర్ దూరంగా ఉన్నారు. కనీసం చివరి రోజున ప్రచారం చేసినా విజయం కచ్చితంగా తెరాస పార్టీ కి అనుకూలంగా ఉండేది. ఇప్పుడు జనాలలోనూ ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు. కెసిఆర్ చేసిన చిన్న తప్పు ఇప్పుడు అసలకే ఎసరు తెచ్చేలా ఉంది . గ్రేటర్ ఎన్నికలలో దాని ప్రభావం గట్టిగానే పడుతుందని విశ్లేషకుల అభిప్రాయం.
ఇదంతా గమనిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ వచ్చే తిరుపతి ఉప ఎన్నికలలో తాను ఏమాత్రం ఉదాసీనంగా ఉండకూడదని బాగా అర్ధమైందట. జగన్ తిరుపతి ఎన్నికల ప్రచారనికి వెళ్తారని అంటున్నారు. తాను ఏడాదిన్నర కాలంగా చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి అది సరైన వేదికగా కూడా ఆయన భావిస్తున్నారు. తిరుపతి వేదికగా విపక్షాల డొల్లతనాన్ని ఎండగట్టడానికి కూడా ఆయన సంసిద్ధులు అవుతున్నారట. ఎన్నిక తిరుపతిలో అయినా కూడా ఆంధ్ర ప్రదేశ్ మొత్తం దాన్ని గమనిస్తుంది కాబట్టి ప్రభుత్వం గురించి నాలుగు మంచి మాటలు చెప్పడం ద్వారా మొత్తం ఏపీ జనాలకు కూడా సానుకూల సంకేతాలు పంపడానికి వీలు అవుతుందని జగన్ వ్యూహంగా ఉంది. అందుకే ఆయన తిరుపతి ఉప ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్తారని సమాచారం.
తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ఎగిరి గంతులేస్తున్న టీడీపీ, బీజేపీ తప్పుడు విధానాలను కూడా జగన్ ఎండగడతారు అంటున్నారు. ఏపీలో ఓటు అడిగే హక్కు తొంబై శాతం హామీలు నెరవేర్చిన తన ప్రభుత్వానికే ఉందని కూడా జగన్ ఢంకా భజాయించి చెబుతారుట. ఇక ప్రత్యేక హోదాతో బీజేపీని, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాజీ పడిన టీడీపీని ఎండగట్టడానికి కూడా జగన్ ఆలోచిస్తున్నారని టాక్. అదే విధంగా వెనకబడిన రాయలసీమ విషయంలో ఆ పార్టీలు ఏం చేశాయో కూడా నిలదీస్తారని అంటున్నారు. ఇక మూడు రాజధానుల అంశాన్ని జనంలోనే పెడతారా అన్న చర్చ కూడా పార్టీలో ఉందిట. మొత్తానికి తాను జనం మనిషిని అని చెప్పుకోవడానికి జగన్ ఎపుడూ ముందే ఉంటారని వైసీపీలో అందరూ అంటూ ఉంటారు.