అప్పుడు సోనియాకి ఇప్పుడు మోడీ కి … జగన్ ‘ రేంజ్’ ఏంటో తెలిసింది!

Telangana Govt Books now has a chapter on SR NTR

కష్టపడితే ఎదో ఒకరోజు ఫలితం దక్కుతుందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి సొంతగా వైసీపీని స్థాపించి, రోజు రోజుకు తన పార్టీని పెంచుకుంటూ ఇప్పుడు దేశంలోనే 4వ పెద్ద పార్టీగా వైసీపీని నిలిపిన ఘనత జగన్ కు దక్కుతుంది. కాంగ్రెస్ నుండి జగన్ బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీ పెద్దలు అస్సలు పట్టించుకోలేదు. పోతేపోనిలే అనుకున్నారు. రోజు రోజుకు జగన్ కు పెరుగుతున్న ఆదరణ చూసి అప్పటి కాంగ్రెస్ పెద్ద సోనియా గాంధీ కూడా ఆశ్చర్యానికి గురి అయ్యారు. అయితే ఒక్కసారి రాష్ట్ర విభజన జరిగిన తరువాత కాంగ్రెస్ ఏపీలో అధః పాతాళానికి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో తన అస్థిత్వాన్ని పూర్తిగా కోల్పోయింది. ఒక్కడిగా ఉన్న జగన్ అప్పటి సోనియా గాంధీకి తన స్టామినా చూపించాడు. ఇప్ప్పుడు ముఖ్యమంత్రిగా ప్రధాని మోడీ దగ్గర తన స్టామినా చూపిస్తున్నారు.

ఏపీలో అసెంబ్లీ, కౌన్సిల్లో వైసీపీ గట్టిగానే ఉంది. అలాగే పార్లమెంట్ లో చూస్తే లోక్ సభలో 22 మంది ఎంపీలతో నాలుగవ అతి పెద్ద పార్టీగా ఉంటే ఇపుడు తాజాగా ఎన్నికైన నలుగురు ఎంపీలతో రాజ్యసభలో కూడా వైసీపీ అతి పెద్ద పార్టీల్లో ఒకటిగా ఉంది. తాజాగా రాజ్యసభ కార్యకలాపాలను నిర్దేశించే బిజినెస్ అడ్వైజర్ కమిటీలో మెంబర్ గా విజయసాయిరెడ్డి నామినేట్ అయ్యారు. అంటే పెద్దల సభలో ఇకపైన వైసీపీకి కూడా తనదైన పాత్ర పోషించే చాన్స్ వస్తుంది. ఇలా పరపతిని రోజు రోజుకు పెంచుకుంటూ ఇప్పుడు దేశంలోనే నాలుగవ పెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది.

దీంతో ఢిల్లీ పెద్దలు కూడా జగన్ కు ఇచ్చే ప్రాముఖ్యతలో పెద్ద మార్పు వచ్చింది. అలాగే వైసీపీ కూడా బీజేపీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు పూర్తి మద్దతు తెలుపుతున్న విషయం కూడా తెలిసిందే. ఇలా బీజేపీకి మద్దతునిస్తూ ప్రధాని మోడీ దగ్గర, బీజేపీ నాయకులకు తన ప్రాముఖ్యతను చెప్పకనే జగన్ చెప్తున్నారు. ఇలాగే తన బలాన్ని పెంచుకుంటూ రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పాడు జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అప్పట్లో సోనియాకు, ఇప్పుడు మోడీకి తన స్టామినా చూపిస్తున్న జగన్ రానున్న రోజుల్లో రాజకీయాల్లో ఇంకెంత ఎదుగుతారో వేచి చూడాలి