చంద్రబాబుకు ఆ ధైర్యం లేదా.. సీఎం జగన్ ప్రశ్నలకు సమాధానం ఉందా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా చంద్రబాబుపై ఒకింత ఘాటుగా విమర్శలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని చంద్రబాబుకు ధైర్యం ఉంటే టీడీపీ కూడా ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించాలంటూ జగన్ సవాల్ విసిరారు. జయహో బీసీ మహాసభలో జగన్ మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. చంద్రబాబు బీసీలను బెదిరించాడని బీసీల అంతు చూస్తానని చెప్పాడని ఆయన చెప్పుకొచ్చారు.

చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు అయినా బీసీల కోసం ఒక్క మంచి పని చేయలేదని జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలతో కలం గడుపుతున్నారని జగన్ చెప్పుకొచ్చారు. దాదాపుగా 3,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా సంక్షేమ పథకాలను అమలు చేశామని జగన్ అన్నారు. చంద్రబాబు విధానం దోచుకో పంచుకో తినుకో అని జగన్ ఎద్దేవా చేశారు.

ఇప్పుడు ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని అప్పటి ప్రభుత్వం ఇవే పథకాలను అమలు చేయడంలో ఎందుకు ఫెయిలైందో ఆలోచించాలని జగన్ కామెంట్లు చేశారు. అన్ని వర్గాలను జగన్ సర్కార్ గుండెల్లో పెట్టుకుందని జగన్ తెలిపారు. మరి జగన్ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా? అనే ప్రశ్నకు లేదనే సమాధానం జవాబుగా వినిపిస్తుంది.

చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని జగన్ పేర్కొన్నారు. నిజాయితీకి, వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరుగుతోందని జగన్ చెప్పుకొచ్చారు. 2019 ఫలితాలను మించి 2024 ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉండాలని జగన్ కోరారు. చంద్రబాబు గురించి జగన్ చేసిన విమర్శలన్నీ నిజమేననే సంగతి తెలిసిందే. ఈ విమర్శల విషయంలో చంద్రబాబు స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.