వైఎస్ అభిమానుల‌కు.. పూన‌కాలు తెప్పించే మాట చెప్పిన సీయం జ‌గ‌న్..!

 Jagan says 100 feets ysr statue Set up at polavaram project
Ys Jagan Mohan Reddy

ఏపీ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు వాడి వేడిగా జ‌రుగుతున్నాయి. గ‌త రెండు రోజుల వ‌లె, ఈరోజు కూడా అసెంబ్లీలో ర‌చ్చ పతాక‌స్థాయిలో జ‌రిగింది. ముఖ్యంగా నేడు పోల‌వరం ప్రాజెక్టు పైనే పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. ముందుగా పోల‌వ‌రం ప్రాజెక్ట్ పై రెచ్చిపోయిన చంద్ర‌బాబును నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ఒక్కో పాయింట్ వివ‌రంగా చెబుతూ అసెంబ్లీలో చాకిరేవు పెట్టాడు.

2014లో ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత త‌న స్వార్ధ ప్ర‌యోజ‌నాల‌కోసం ప్ర‌త్యేక‌హోదాతో పాటు పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను ఏ విధంగా తాక‌ట్టు పెట్టారో చెప్పి చంద్ర‌బాబును ఉతికిప‌డేశాడు అనిల్. పోల‌వ‌రం విష‌యంలో చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల్ని అసెంబ్లీ సాక్షిగా బ‌య‌ట‌పెట్టి అనిల్ ప‌రువు తీయ‌గా, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన ఒక్క స్టేట్‌మెంట్స్‌తో చంద్ర‌బాబు మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు.

ముందుగా చంద్ర‌బాబు అండ్ బ్ర‌ద‌ర్స్ చేస్తున్న మ‌తిలేని ఆరోప‌ణ‌ల‌కు జ‌గ‌న్ ఓ రేంజ్‌లో కౌంట‌ర్లు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో చంద్రబాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న జ‌మానాలో 83 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశార‌ని, అలాగే అప్ప‌ట్లో పోలవరం సందర్శనకు వచ్చిన టీడీపీ మహిళా కార్యకర్తలు చంద్రబాబును పొగుడుతూ భజన పాట పాడిన వీడియోను శాసనసభలో ప్లే చేయ‌డ‌మే కాకుండా, ప్రజల సొమ్ముతో చంద్రబాబు భ‌జ‌న చేయించుకున్నార‌ని బాబును ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.

ఇక పోల‌వ‌రం డ్యామ్ ఒక్క అంగుళం కూడా త‌గ్గించేది లేద‌ని చెప్పిన జ‌గ‌న్, దివంగ‌త నాయ‌కుడు వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా 45.72 మీటర్ల ఎత్తు నిర్మిస్తామని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురైనా పోల‌వ‌రం ప‌నులు ఆప‌లేద‌ని, యుద్ధ ప్రాతిప‌దిక‌న పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు జ‌రుగుతున్నాయని స్ప‌ష్టం చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను చెప్పిన స‌మ‌యానికి పూర్తి చేస్తామ‌న్న జ‌గ‌న్ అక్క‌డ 100 అడుగుల వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి, వైఎసెఆర్ అభిమానులకు పూన‌కాలు తెచ్చే స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన‌ నిధులతో పోలవరం ప్రాజెక్టును కడుతూ, అక్కడ వైయస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా అంటూ చంద్ర‌బాబు ఏడుపు మొద‌లు పెట్టారు.