మద్యం విషయంలో సంచలన నిర్ణయం.. జగన్ సర్కార్ షాకివ్వనుందా?

2019 ఎన్నికలకు ముందు ఏపీ సీఎం వైఎస్ జగన్ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం దిశగా అడుగులు పడటం లేదు. ఏపీ ప్రభుత్వానికి మద్యం నుంచి ప్రధానంగా ఆదాయం వస్తుండటంతో జగన్ సర్కార్ నిషేధం దిశగా అడుగులు వేయడం లేదు. అయితే మద్యం విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది.

ప్రైవేట్ వ్యాపారులకు మద్యం దుకాణాలను అప్పగించే దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. మూడురోజుల క్రితం జరిగిన ఒక సమావేశంలో ఈ మేరకు చర్చ జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి 20,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ప్రైవేట్ వ్యాపారులకు మద్యం దుకాణాలను అప్పగిస్తే వాళ్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి విక్రయాలు పెంచుతారని ప్రభుత్వం భావిస్తోంది.

మద్యం విక్రయాల ద్వారా ఆదాయం పెరిగినా మద్యానికి ఉన్న డిమాండ్ స్థాయిలో అమ్మకాలు మాత్రం జరగడం లేదు. కొంతమంది నాటుసారాకు అలవాటు పడటం మరి కొందరు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించుకుంటూ ఉండటంతో ప్రభుత్వానికి ఆదాయం అంతకంతకూ తగ్గుతోందని తెలుస్తోంది. రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్గడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రేట్లు ఎక్కువగా ఉండటం, అన్ని బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం, నాటుసారా తయారీ వినియోగం ఊహించని స్థాయిలో పెరగడం, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం వస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సుంకం చెల్లించని మద్యం రాష్ట్రంలోకి అక్రమంగా వస్తోందని సమాచారం అందుతోంది. ప్రభుత్వం ప్రైవేట్ వ్యాపారులకు మద్యం దుకాణాలను అప్పగిస్తే మాత్రం జగన్ సర్కార్ పై విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంది.