జనవాణికి కాపీ జగనన్నకు చెబుదాం.. ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగనన్నకు చెబుదాం పేరుతో అతి త్వరలో ఈ కార్యక్రమం అమలు జరగనుందని బోగట్టా. ప్రజల సమస్యలలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకుండా మిగిలిపోకూడదని ఏ సమస్యపై ఎలాంటి పరిష్కారం చూపాలనే దానిపై ఒక విధానాన్ని తయారు చేయాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం.

స్పందన కంటే మెరుగ్గా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం అమలులోకి వస్తే స్పందన ఉంటుందో ఉండదో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమం జనవాణికి కాపీ అని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇతర అధికార వ్యవస్థలు ప్రజల సమస్యలను పరిష్కరించేలా ఈ కార్యక్రమం ఉండనుందని బోగట్టా.

అయితే స్పందన కార్యక్రమంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఉద్యోగులు సమస్య పరిష్కరించకుండానే సమస్య పరిష్కారం అయినట్టు పోర్టల్ లో నమోదు చేస్తుండటంతో చాలామంది బాధితులకు సరైన న్యాయం జరగడం లేదు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంతో అయినా ఈ సమస్య పరిష్కారం అవుతుందేమో చూడాల్సి ఉంది. ప్రజలకు మేలు జరగడం కోసం జగన్ సర్కార్ ఎన్నో కొత్త స్కీమ్స్ ను అమలు చేస్తుండటం గమనార్హం.

అయితే ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేలా జగన్ సర్కార్ కృషి చేస్తే మాత్రం ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. జగన్ సర్కార్ ప్రజలకు బెనిఫిట్ కలిగే విధంగా మరిన్ని పథకాల అమలు దిశగా అడుగులు వేయాలని మరి కొందరు చెబుతున్నారు. జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి ప్లస్ అవుతాయో మైనస్ అవుతాయో చూడాలి.