ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతికి కేంద్రం నుంచి కూడా నిధులు రావడం లేదు. ఇందుకు సంబంధించి ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతికి నిధులు రాకపోవడానికి ఒక విధంగా జగన్ కారణమని సమాచారం అందుతోంది. అమరావతి నిధుల విషయంలో దుర్వినియోగం జరిగిందని మూడేళ్ల క్రితం జగన్ లేఖ రాశారని బోగట్టా.
ఈ రీజన్ వల్లే కేంద్ర ప్రభుత్వం నిధులను నిలిపివేసిందని తెలుస్తోంది. ఏపీ సర్కార్ అక్రమాల వివరాలను చెప్పిన తర్వాతే నిధుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి రైల్వే లైన్లకు నిధులు ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు సమాచారం అందుతోంది. అక్రమాలు జరిగాయని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అక్రమాలు జరిగాయో మాత్రం చెప్పలేదని బోగట్టా.
ఏపీలో వెనుకబడిన జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు చెల్లించిన కేంద్ర ప్రభుత్వం ఆ ఖర్చులకు లెక్కలు చెప్పిన తర్వాతే వెనుకబడిన జిల్లాల కోసం నిధులు కేటాయిస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని జగన్ సర్కార్ కోరినా కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించలేమని తేల్చి చెప్పింది.
ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నష్టపోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తుండగా రాబోయే రోజుల్లో ఏం జరగనుందో చూడాల్సి ఉంది. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో ఒకింత గందరగోళానికి కారణమవుతున్నాయి.