జగన్ సర్కార్ నిర్ణయంతో వాళ్లకు షాక్.. టీచర్లకు మాత్రమే కాదంటూ?

ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు గురించి ప్రజల్లో కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించరని చేయాల్సిన పనులను సమయానికి చెయ్యరని కొన్నిసార్లు డబ్బుల కోసం పనిని ఆలస్యం చేస్తారని చాలామంది భావిస్తారు. ఇలాంటి ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపదనే సంగతి తెలిసిందే.

అయితే జగన్ సర్కార్ మాత్రం ఇలాంటి ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమైంది. అయితే ప్రభుత్వం అమలులోకి తెస్తున్న నిబంధనలు పని చెయ్యని వాళ్లతో పాటు విధులను సక్రమంగా నిర్వహిస్తున్న వాళ్లకు సైతం ఇబ్బందులను కలిగిస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టీచర్లకు ఏపీ సర్కార్ కొత్తగా సెల్ఫీ అటెండెన్స్ ను తీసుకొచ్చింది.

ఈ యాప్ వల్ల తమ డేటా చోరీ అయ్యే అవకాశం ఉందని టీచర్లు టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం విధుల్లో పారదర్శకత కోసమే ఈ విధంగా చేస్తున్నామని చెబుతోంది. త్వరలో అన్ని ప్రభుత్వ శాఖలలో నిబంధనలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతుండటం గమనార్హం. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ రూల్స్ అమలైతే ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగుల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే ఛాన్స్ ఉంది.

పైకి వెల్లడించకపోయినా ఎన్నికల సమయంలో వీళ్ల ఓట్లు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తక్కువే అయినా వీళ్ల కుటుంబాలు, బంధువులు కూడా ఎన్నికల్లో గెలిచే పార్టీని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారు. 2024 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారో చూడాల్సి ఉంది.