ఆంధ్రప్రదేశ్ లో 25 జిల్లాలొస్తాయి…

ఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న 13 జిల్లాలను 25 కు పెంచేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైసిసి అధినేత, ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇచ్ఛాపురంలో ఈ రోజు ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ జిల్లాల పెంపు విషయం ప్రకటించారు. రాష్ట్రంలో పాలనా వ్యవస్థను పేదలకు అనుకూలంగా ఉండేలా సమూలంగా మార్చేస్తామని ఆయన ప్రకటించారు. ఇదే విధంగా తెలంగాణ రైతు బంధును పోలిన పథకం కూడా ఆయన ప్రకటించారు. 

 రాష్ట్రంలోని ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తాం. ఇలా రాష్ట్రంలో పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు 25 పార్లమెంటరీ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా మారుస్తాం. ఇదే విధంగా ప్రతి పంచాయతీలో  గ్రామసచివాలయం ఏర్పాటుచేస్తాం. అన్నిపథకాలు ఇక్కడి నుంచి మొదలువుతంది. గ్రామ సచివాలయం నుంచే పేద ప్రజలు  పథకాల ప్రయోజనాలు పొందుతారు. జిల్లా పరిపాలనకు కలెెక్టర్ ను బాధ్యుడిని చేస్తాం,  అని జగన్ ప్రకటించారు.

రైతుకు నగదు బదిలీ పథకం గురించి చెబుతూ  ప్రతి ఏటా ప్రతిరైతుకు ఎకరానికి రు.12500 పంటసాయం కింద అందిస్తామని  జగన్ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

గ్రామంలో పది 50 పేదకుటుంబాలకు ఒక వలంటీర్ నియమిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.