ఏపీ సీఎం వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా గెలిచేలా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ కచ్చితంగా విజయం సాధించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో జగన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జగన్ చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నా ఆయనపై వ్యతిరేకత మాత్రం పెరుగుతూనే ఉంది.
జనసేన, టీడీపీ చేస్తున్న విమర్శలతో పాటు అర్హత లేకపోవడం వల్ల సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందలేని వాళ్లు జగన్ సర్కార్ పై వ్యతిరేకత కనబరుస్తున్నారు. అయితే మరోవైపు పవన్ జగన్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకూడదని అందుకోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమని పవన్ చేస్తున్న కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
వైసీపీపై కక్ష కట్టిన పవన్ కళ్యాణ్ తనకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నారు. జగన్ సర్కార్ ను దింపే బాధ్యత నాది అని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నంలో ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాల్సిఉంది. సీఎం కావాలని ఆశిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసం ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది.
టీడీపీ నుంచి స్పష్టమైన హామీ లభించడం వల్లే పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి అనుకూలంగా కామెంట్లు చేస్తున్నారని కొంతమంది చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్లానింగ్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. జగన్ పై కక్షతో పవన్ ఏపీ ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.