చంద్రబాబును చేసి జగన్ నేర్చుకోవాల్సిందే.. ఇద్దరి మధ్య తేడాలు ఇవే!

jagan underestimated the chandrababu naidu range

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా విషయాలలో తేడాలు ఉన్నాయి. జగన్ ఇన్ని మంచి పథకాలను అమలు చేస్తున్నా ఆయనపై ప్రజలలో వ్యతిరేకత రావడానికి కూడా ఒక విధంగా ఇదే కారణమని చెప్పవచ్చు. చంద్రబాబు మంచి చేస్తే మీడియాలో పాజిటివ్ గా వచ్చేలా ఏదైనా తప్పు చేస్తే ఆ విషయం గురించి అస్సలు ప్రచారం జరగకుండా జాగ్రత్త పడటంలో సిద్ధహస్తులు.

చంద్రబాబు టెక్నాలజీ సహాయంతో ప్రభుత్వ పాలనను సులభతరం చేసుకోవడంతో ప్రజల్లో మంచి అభిప్రాయం కలిగితే తన వల్లే ఈ స్థాయి గుర్తింపు దక్కిందని ప్రచారం చేసుకోగల సిద్ధహస్తులు. జగన్ మాత్రం ప్రజల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఈ విషయంలో తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చినా ఆ హామీలలో మెజారిటీ హామీలను చివరి సంవత్సరం వరకు అమలు చేయరు.

ఈ విధంగా చేయడం వల్ల ఎన్నికల సమయానికి కొత్త పథకాల ప్రయోజనాలను పొందుతున్నామనే భావనను ప్రజలకు కలిగించడంలో చంద్రబాబు సఫలమవుతున్నారు. జగన్ మాత్రం అన్ని పథకాలను మొదట్లోనే అమలు చేయడంతో కొత్తగా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు తనపై ఎన్ని విమర్శలు వచ్చినా తాను నిజంగా తప్పు చేస్తే ఆ విమర్శల గురించి స్పందించడానికి అస్సలు ఇష్టపడరు.

మౌనంగా ఉండటం ద్వారా ఆ వివాదం గురించి అందరూ మరిచిపోయేలా ఆయన జాగ్రత్త పడుతున్నారు. జగన్, వైసీపీ మంత్రులు వైసీపీ సర్కార్ చేసిన తప్పుల గురించి అతిగా స్పందిస్తూ చిన్న వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు. వైసీపీ సర్కార్ ఎన్నో మంచి పథకాలను అమలు చేస్తున్నా ఆ పథకాల కంటే వివాదాల ద్వారానే వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. చంద్రబాబును చూసి జగన్ చాలా విషయాలను నేర్చుకోవాల్సి ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.