మూడు రాజధానుల విషయంలో ఏం చేసినా నష్టమే.. జగన్ మారక తప్పదా?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న మూడు రాజధానుల నిర్ణయం గురించి ప్రకటించిన సమయంలో పాజిటివ్ గా కామెంట్లు వినిపించాయి. ఈ నిర్ణయం వల్ల అన్ని జిల్లాల అభివృద్ధి జరుగుతుందని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే మూడు రాజధానుల విషయంలో ఏం చేసినా నష్టమేనని జగన్ సర్కార్ కు నెమ్మదిగా అర్థమవుతోంది. మూడు రాజధానుల నిర్ణయం వెంటనే అమలై ఉంటే జగన్ సర్కార్ కు పాజిటివ్ గా ఇమేజ్ పెరిగేది.

అయితే ఈ నిర్ణయం అమలు ఆలస్యం అవుతుండటంతో పాటు జగన్ సర్కార్ పరువు పోతుంది. ఈ ఏడాది నుంచి విశాఖ నుండి పాలన మొదలవుతుందని వైసీపీ నేతలు చెబుతున్న వైసీపీ నేతల మాటలను ఎవరూ నమ్మడం లేదు. వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల అమలు విషయం మినహా మిగతా అన్ని విషయాల్లో ఫెయిల్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మూడు రాజధానుల విషయంలో జగన్ తుది నిర్ణయం తీసుకుని ప్రజలకు ప్రయోజనం చేకూరే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. అమరావతినే రాజధానిగా జగన్ కొనసాగించి ఉంటే ఈపాటికే రాష్ట్ర అభివృద్ధి జరిగేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానుల అమలు విషయంలో కోర్టుల నుంచి సైతం జగన్ సర్కార్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలు చేయకుండా ఎన్నికలకు వెళితే పార్టీకి భారీ స్థాయిలో నష్టమని వైసీపీ భావిస్తుండటం గమనార్హం. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. విశాఖలో జగన్ రాజధానిని ఏర్పాటు చేయడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ ప్రజలు సైతం ఈ నిర్ణయం విషయంలో అసంతృప్తితో ఉన్నారు.