రాజధానుల విషయంలో జగన్ మారతారా.. ప్రజలకు విసుగొస్తోందిగా?

YS-Jagan-Mohan-Reddy-4

ఏపీ రాజధాని విషయంలో జగన్ విశాఖకు ప్రాధాన్యత ఇస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం అమరావతికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజధాని విషయంలో భిన్నాభిప్రాయాల వల్ల నష్టం ఏ పార్టీకి అనే ప్రశ్న వినిపిస్తే వైసీపీకి అనే సమాధానం వినిపిస్తోంది. ఐదేళ్లు అధికారం ఉన్నప్పటికీ అమరావతి అభివృద్ధి జరిగేలా చంద్రబాబు ఎక్కువగా నిర్ణయాలు తీసుకోలేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ఘోర ఫలితాలు ఎదురయ్యాయి.

ఇప్పుడు రాజధాని విషయంలో జగన్ మొండిపట్టు వల్ల ఏపీ ప్రజలకు ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఏదనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే రాజధాని విషయంలో ప్రజలకు కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. రాజధాని విషయంలో ప్రజలకు విసుగు వస్తుండటంతో ప్రజల నుంచి జగన్ పై విమర్శలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

వైజాగ్ ను రాజధానిగా ఎంపిక చేయడంలో జగన్ నిర్ణయం రైటే అయినా ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా జగన్ పై ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. మరోవైపు పదుల సంఖ్యలో సలహాదారులను జగన్ నియమించుకుంటున్నా వాళ్ల వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంది.

సీఎం అంటే సంక్షేమ పథకాలను అమలు చేయడం మాత్రమే కాదని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. జగన్ సర్కార్ వృథా ఖర్చులకు ప్రాధాన్యత ఇస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్లపై ఎలాంటి జగన్ సర్కార్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.