వైసీపీ మంత్రి శెట్టి శ్రీనివాసరావు మూడు రాజధానుల విషయంలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ముఖ్యంగా పరిపాలనా రాజధాని విశాఖ పట్టణం ఆయన సొంత జిల్లా కావడంతో విశాఖలో మరింత యాక్టివ్ గా పనిచేస్తుంటారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలే తరువాయి వెంటనే ఆ పని ముందు వాలిపోతారాయన. వైసీపీలో కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సపోర్ట్ కూడా ఫుల్గా ముత్తం శెట్టికి ఉండటంతో విశాఖను దున్నేస్తున్నారు. ఒకప్పుడు స్నేహితుడుగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీలోకి వస్తే ఎక్కడ తన ప్రాబల్యం తగ్గిపోతుందనని చివరికి స్నేహితుడ్ని కూడా సైడేసి అంతా తానై ఉండాలని చూస్తున్నారు.
విశాఖ నుంచి ప్రతీ అప్ డేట్ ను నేరుగా సీఎంకి చేరవేసేది కూడా ముత్రంశెట్టినే. అయితే ఇప్పుడా మంత్రి దూకుడుకు ఓ ఐఏఎస్ ఆఫీసర్ చెక్ పెడుతున్నట్లు సమాచారం. ఈ ఐఏఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా కావాల్సిన వారుట. అత్యంత ఆత్మీయుడని సమాచారం. ఇప్పుడు విశాఖకు సంబంధించి ప్రతీ వ్యవహారం ఆ ఐఏఎస్ కనుసన్నలోనే ఉండేలా చూసుకుంటున్నారుట. పరిపాలన రాజధానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డికి ఈయనే చెవిన వేస్తున్నారుట. డెవలెప్ మెంట్ కు సంబంధించి సూచనలు, సలహాల్ని సైతం ఐఏఎస్ ని అడిగి తెలుసుకుంటున్నారుట.
సదరు అధికారి మంత్రి సూచనల్ని కూడా లైట్ తీసుకుంటున్నారుట. ఈ నేపథ్యంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తర్జన భర్జన పడుతున్నారుట. ఇన్నాళ్లు తన కనుసన్నల్లో ఉన్న విశాఖ ఇప్పుడు ఓ ఐఏఎస్ చేతుల్లోకి వెళ్లిపోవడంతో ముఖ్యమంత్రి దగ్గర తన బలం..విశాఖపై పట్టు తగ్గిపోతుందని కంగారు పడుతున్నారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మరి ఉన్నట్లుండి విశాఖకు ఐఏఎస్ ఎంట్రీ వెనుక అసలు కారణం ఏమై ఉంటుందో? ఇప్పటివరకూ లేని అధికారిని ఇప్పుడే ఎందుకు నియమించినట్లు? ఇలా చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.