పవన్ భార్యల గురించి జగన్ కామెంట్లు.. విమర్శలు హద్దులు దాటాయేమో?

ఏపీ సీఎం వైఎస్ జగన్ సాధారణంగా విమర్శలు చేసినా ఒకింత హుందాగానే విమర్శలు చేస్తారని పొలిటికల్ వర్గాల్లో అందరూ భావిస్తారు. అయితే తాజాగా జగన్ మాత్రం విమర్శల విషయంలో ఒకింత హద్దులు దాటారు. పవన్ భార్యల విషయంలో జగన్ పరోక్షంగా చేసిన విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి. సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి విమర్శలు చేయడం ఏంటని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

చంద్రబాబు, పవన్ గురించి విమర్శలు చేసే హక్కు జగన్ కు ఉందని అయితే వ్యక్తిగత జీవితాల గురించి టార్గెట్ చేసి విమర్శలు చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు భావిస్తున్నారు. చంద్రబాబు, పవన్ వేర్వేరు కారణాల వల్ల వైసీపీపై విమర్శలు చేస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు. పవన్ భార్యల గురించి ఇప్పటికే ఎంతోమంది విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శల గురించి పవన్ కళ్యాణ్ సైతం బదులివ్వడం జరిగింది.

తాను విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నానే తప్ప భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకోలేదని పవన్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పవన్ ఎన్నిసార్లు చెప్పినా ఈ విమర్శలు మాత్రం ఆగడం లేదు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో మచ్చలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ పై జగన్ చేస్తున్న విమర్శలు పవన్ ఫ్యాన్స్ కు కూడా నచ్చడం లేదనే సంగతి తెలిసిందే.

పవన్ పై విమర్శలు చేయడం వల్ల పవన్ ను అభిమానించే జగన్ అభిమానులు సైతం దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. రాజకీయ శత్రువులను వ్యక్తిగత శత్రువులుగా భావించి చేసే విమర్శల వల్ల జగన్, పవన్ కళ్యాణ్ మధ్య దూరం మరింత పెరుగుతుంది. ఈ విషయంలో జగన్ ఆచితూచి అడుగులు వేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.