నరసింహన్ తో జగన్ మోహన్ రెడ్డి భేటీ ఎందుకోసం ?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై .ఎస్ .జగన్ మోహన్ రెడ్డి ఈరోజు హైద్రాబాద్లో తెలంగాణ గవర్నర్ ఈ. ఎస్ ఎల్ నరసింహన్ ను కలవడం అందరి దృష్టిని ఆకర్షించింది . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ గత నెల 24న ప్రమాణ స్వీకారం చేశారు . నరసింహన్ తెలంగాణ గవర్నర్ గా కొనసాగుతున్నారు . సహజంగా ముఖ్యమంత్రి రాష్ట్ర సమస్యలను వివరించడానికి గవర్నర్ ను కలుస్తూ వుంటారు . అది సంప్రదాయం . అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది .
ఇది కేవలం మర్యాద పూర్వకమైన సమావేశమని చెబుతున్నా జగన్ మోహన్ రెడ్డి నరసింహన్ మధ్య గంటకు పైగా సామావేశం జరిగింది . వీరిద్దరి మధ్య రెండు రాష్ట్రాలకు సంబందించిన పలు అంశాలు చర్చకువచ్చినట్టు తెలిసింది . రాష్ట్ర విభిజన సమయంలో నరసింహన్ గవర్నర్ గా వున్నారు . ఆ తరువాత 2019 ఎన్నికలు జరిగిన తరువాత కూడా నరసింహన్ రెండు రాష్ట్రాల గవర్నర్ వున్నారు . జగన్ మోహన్ రెడ్డి తో నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు . ఈ కారణంతో జగన్ నరసింహన్ తో మర్యాదపూర్వకంగా కలిశారా ? ఒక వేళ మర్యాద కోసమే అనుకుంటే గంటకు పైగా చర్చించాల్చిన అవసరం లేదుగా ?. జగన్ మోహన్ రెడ్డి అమెరికా నుంచి ఢిల్లీ వచ్చిన తరువాత 8న కేంద్ర హోం శాఖ కార్యదర్శి తో సమావేశమవుతున్నారు . ఆ సమావేశంలో అంశాలను గవర్నర్ నరసింహన్ , తెలంగాణ ముఖ్య మంత్రి కె. చంద్ర శేఖర్ రావుతో చర్చినట్టు తెలుస్తుంది .