కేసీఆర్ తో జగన్ సమావేశం అందుకేనా ?
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై .ఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితం హైద్రాబాద్లోని ప్రగతి భవన్ లో సావేశమయ్యారు .జగన్ మోహన్ రెడ్డి జెరూసలం , అమెరికా వెళ్లే ముందు హైదరాబాద్ వచ్చారు . ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది . గతంలో వీరిరువు ప్రగతి భవన్ లో మొదటిసారి కలిసినప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తరువాత అపరిష్కృతంగా వున్నా అనేక సమస్యలపై చర్చించారు . ఆ తరువాత ఇరు రాష్ట్ర అధికారులు కూడా వివిధ సమస్యపై సమావేశమయ్యారు .
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రెండు రాష్ట్ర మధ్య ఉద్రికత్త వాతావరణం తగ్గిపోయింది . చంద్ర శేఖర్ రావు అడగగానే ఇంతవరకు ఆంధ్ర ప్రదేశ్ ఆధీనంలో వున్న సచివాలయ భవనాలను కూడా జగన్ ఖాళీ చేయించి ఇచ్చారు . ఇలాగే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చంద్ర శేఖర్ రావు వచ్చి ఆశీర్వదించారు . తెలంగాణ లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కేసీఆర్ ఆహ్వానించగానే జగన్ వెళ్లారు . అప్పటి నుంచి ఇరువురి మధ్య స్నేహ సంబంధం కొనసాగుతూ వుంది .
జగన్ మోహన్ రెడ్డి మర్యాద పూర్వకంగానే చంద్ర శేఖర్ రావు నుకలిశారని వై .ఎస్ .ఆర్ పార్టీ నాయకులు చెబుతున్నారు . అయితే ఈ భేటీకి తప్పనిసరిగా ప్రాధాన్యత వుందనిపిస్తూంది . ఈ నెల అమెరికా నుంచి జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఢిల్లీ వెడతారని ,అక్కడ రెండు రోజులు ఉంటారని అధికారులు చెబుతున్నారు ఈ నెల 8న కేంద్ర హోమ్ శాఖ అధికారులతో జగన్ మోహన్ రెడ్డి సమావేశమవుతున్నారు . ఈ సమావేశంలో విభజన సమస్యలు చర్చకు వచ్చే అవకాశం వుంది . అందుకే జగన్ మోహన్ రెడ్డి చంద్ర శేఖర్ రావుతో సమావేశం అయినట్టు తెలుస్తోంది .