గవర్నర్ రాజముద్రతో మూడు రాజధానుల అంశం ఓ కొలిక్కి వచ్చింది. కానీ తరలింపు ప్రక్రియను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్షం విశ్వ ప్రయత్నాల్లో భాగంగా ఆ ప్రక్రియకు తాత్కలికంగా మాత్రమే బ్రేక్ పడింది. మూడు రాజధానుల్లో రెండు రాజధానులుగా..అంటే శాసన రాజధానిగా అమరావతి..పరిపాలనా రాజధానిగా విశాఖ ఖరారయ్యాయి. మరి కర్నూలు ని న్యాయ రాజధాని విషయంలో ఇప్పుడు కేంద్రం కొత్త మేలిక పెట్టి మాట్లాడుతోంది. అలాగే నిపుణులు సైతం కర్నూలు న్యాయ రాజధానిగా ఎలా అవుతుందని? మొదటి నుంచి వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. కేంద్ర హోంశాఖ తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ లో హైకోర్టు ఉన్నంత మాత్రాన రాజధాని కాదని అంటోంది.
న్యాయ రాజధాని కావాలంటే? సుప్రీంకోర్టు అనుమతి, హైకోర్టు ప్రధాన అనుమతి తప్పని సరి. అవేం కాకుండా? జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మూడు రాజధానులు అని ఎలా సమర్ధించుకుంటారు? అని కొత్త వాదన తెరపైకి వస్తొంది. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి కేంద్రంపై అసంతృప్తిగా ఉన్నట్లు మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. అదీ రాజముద్ర పడిన తర్వాత కేంద్రం అఫిడవిట్ లో ఎందుకలా పేర్కొన్నారన్నది అర్ధం కాని అంశం గా మారింది .
అయితే ఇవన్నీ తెలియకుండానే గవర్నర్ రాజ ముద్ర వేసి ఆ ఫైల్ ని రాష్ర్ట ప్రభుత్వానికి పంపించారా? మూడు రాజధానుల అంశాన్ని న్యాయ నిపుణుల సలహాలు తీసుకో కుండా..న్యాయ పరంగా ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించకుండానే సంతకం చేసారా? చట్ట పరంగా ప్రభుత్వానికి ఎదురయ్యే ఇబ్బందులను ప్రభుత్వం ముందే అంచనా వేయలేకపోయిదా? గవర్నర్ సంతకానికి ఉన్న ఫవర్ తెలియకుండానే ప్రతిపక్షం ఇలా యాగీ చేస్తుందా? న్యాయ రాజధాని గా కర్నూలు సాధ్యం కాదనకున్నప్పుడు అమరావతి రైతుల ఉద్యమం స్పీడ్ తగ్గాలి కదా? మరి అలా ఎందుకు జరగలేదు.అన్న సందేహాలు కూడా తెర మీదకు రావాలి.
హైకోర్టు స్టేటస్ కోని ఎన్నాళ్లు పొడిగించుకుంటూ వెళ్తుంది? అసలు కేంద్రం అఫిడవిట్ లో అలా పేర్కొనడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా? జగన్ ని ముందు నుంచి పొగుడుతూనే వెనుక నుంచి పొమ్మనలేక పొగపెట్టే కార్యక్రమం పెట్టుకుందా? అన్న దానిపై కూడా సందేహాలున్నాయి. వాటిని కూడా నివృత్తి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.