ఆ వైసీపీ ఎమ్మెల్యేకు టికెట్ లేనట్టే.. వాళ్లకు కూడా షాక్ తప్పదంటూ?

ఏపీ సీఎం వైఎస్ జగన్ 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చేలా వ్యూహాలు రచిస్తున్నారు. కష్టపడి పని చేస్తున్న ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని జగన్ ఫిక్స్ అయ్యారు. గడపగడపకూ వైసీపీ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేలు ప్రజలకు మరింత దగ్గర కావాలని జగన్ భావిస్తుండటం గమనార్హం. అయితే పలువురు ఎమ్మెల్యేలు మాత్రం గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు.

అయితే ప్రజలకు దూరంగా మెలుగుతున్న ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి షాక్ తప్పదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ కు తోడుగా ఉన్న ఎమ్మెల్యేలలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకరు కాగా జగన్ కోసం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పదవులను సైతం త్యాగం చేశారు. గతంలో ఈయనకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగినా వేర్వేరు కారణాల వల్ల ఈయనకు మంత్రి పదవి దక్కలేదు.

గతంలో పలు సందర్భాల్లో ఈ ఎమ్మెల్యే చేసిన కామెంట్ల వల్ల పార్టీకి నష్టం కలిగింది. గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో ఈ ఎమ్మెల్యే పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే ఈ విధంగా చేయడంతో సీఎం జగన్ ఆయన విషయంలో సీరియస్ గా ఉన్నారని సమాచారం అందుతోంది. 2024 ఎన్నికల్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సీటు దక్కే అవకాశం అయితే దాదాపుగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రాబోయే రోజుల్లో మరి కొందరు ఎమ్మెల్యేలకు సైతం షాకులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రజలలో ఉండేవాళ్లకు ప్రజల సమస్యలను పరిష్కరించే వాళ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో వైసీపీ గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారు. అయితే ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో తెలియాలంటే మాత్రం మరో 20 నెలలు ఆగాల్సిందే.