టీడీపీకి భారీ షాక్ ఇచ్చిన జగన్.. ఆ ఖర్చు భారం ఎవరిపై పడుతుందో?

Rajya Sabha Elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ఎన్నో మంచి పథకాలను అమలు చేస్తున్నప్పటికీ రాజన్న క్యాంటీన్ల ఏర్పాటు దిశగా అడుగులు వేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఉంటే తక్కువ ఖర్చుతో పేద ప్రజలకు, కూలి పనులు చేసేవాళ్లకు ఆహారం అంది ఉండేది. జగన్ సర్కార్ ఈ విషయంలో తప్పటడుగు వేయడంతో టీడీపీ నేతలు ఏపీలోని పలు ప్రాంతాలలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు.

అన్న క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు 5 రూపాయలకు, 2 రూపాయలకు ఆహారం అందే విధంగా టీడీపీ నేతలు చర్యలు తీసుకుంటున్నారు. అయితే అన్న క్యాంటీన్ల విషయంలో అధికారులు జోక్యం చేసుకోవడం, అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిన వాళ్లకు ఇబ్బందులను కలగజేయడంపై సాధారణ ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్లుగా వైసీపీ తీరు ఉందని మరి కొందరు కామెంట్లు చేశారు.

అయితే ఇక్కడ టీడీపీ ప్లాన్ వేరేలా ఉంది. జగన్ సర్కార్ అన్న క్యాంటీన్లకు ఇబ్బందులు కలిగిస్తుందని టీడీపీ నేతలకు సైతం తెలుసు. తక్కువ రేట్లకు ఎక్కువ రోజుల పాటు పేద ప్రజలకు ఆహారం అందించడం సులువైన విషయం కాదు. అయితే తాజాగా జగన్ అన్న క్యాంటీన్ల జోలికి వెళ్లవద్దని వైసీపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సమాచారం అందుతోంది.

టీడీపీ ఎన్నికల వరకు అన్న క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు కచ్చితంగా ఆహారం అందించాల్సి ఉంటుంది. ఈ విషయంలో టీడీపీ వెనుకడుగు వేస్తే టీడీపీపై విమర్శలు వ్యక్తమవుతాయి. జగన్ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం టీడీపీకి ఇబ్బంది అని చెప్పవచ్చు. టీడీపీ ప్రస్తుతం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో అన్న క్యాంటీన్ల నిర్వహణతో టీడీపీకి ఇబ్బందే అని చెప్పవచ్చు. టీడీపీకి జగన్ బారీ షాకిచ్చారని అన్న క్యాంటీన్ల భారం ఎవరిపై పడుతుందో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.