అయోమయంలో ఉన్న కీలక పథకంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడి పథకంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పిల్లలను స్కూళ్ళపై పంపే తల్లి, దండ్రులకు ఏడాదికి రూ. 15 వేలు ఇస్తానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పథకానికి అమ్మఒడి అని పేరుపెట్టారు.
అయితే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పథకం అమలుపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పథకం కేవలం ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే పిల్లలకు మాత్రమే వర్తిస్తుందని ముందు అన్నారు. తర్వాత ఏమో ప్రైవేటు స్కూళ్ళల్లో చదవిలే పిల్లలకు కూడా వర్తిస్తుందన్నారు.
దానిపై ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి మాట్లాడుతూ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మాత్రమే వర్తిస్తుందని క్లారిటి ఇచ్చారు. అయితే తర్వాత మాట్లాడుతూ ఇతర స్కూళ్ళల్లో చదవే పిల్లలకు కూడా వర్తింపచేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. దాంతో అందరిలోను అయోమయం నెలకొంది.
ఈ విషయం జగన్ దృష్టికి వెళ్ళింది. దాంతో జగన్ స్పందిస్తూ అమ్మఒడి పథకం ఏ స్కూల్లో చదివే పిల్లలకైనా సరే వర్తింపచేస్తామని క్లారిటీ ఇచ్చారు. దాంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలను స్కూళ్ళలో చేర్పించటం, మధ్యలో ఆపకుండా చదువులు కొనసాగించాలన్న ఉద్దేశ్యంతోనే పథకం ప్రారంభించినట్లు జగన్ చెప్పటంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది.