టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మద్యం ఏరులై పారేది. మద్యం ప్రియులు పండగ చేసుకునేవారు. తాగినోడికి తాగినంత. రాష్ర్టానికి కావాల్సినంత ఆదాయం ఒక్క లిక్కర్ పైనే వచ్చేది. కానీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీన్ రివర్స్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల మేనిఫేస్టో లో భాగంగా జగన్ పీఠం ఎక్కగానే మద్య నిషేధం పైనే ఏకాగ్రత పెట్టారు. మందు బాబుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేసారు. ధపధపాలుగా మద్యం నిషేధం ఉంటుందని…తన పదవీ కాలం పూర్తయ్యే లోపు మందు చుక్క లేకుండా చేస్తానని మాటిచ్చారు. కేవలం 5 స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యం పరిమితం అవుతుందని..మద్యానికి బానిసైన బ్రతుకులు బాగు పడాలంటే? ఇలా చేయక తప్పదని చెప్పకనే చెప్పారు.
ఇప్పుడా మాటను నిలబెట్టుకునే ప్రయత్నాల్లో జగన్ ప్రభుత్వం బిజీగా ఉంది. ఇప్పటికే రాష్ర్టంలో చాలా వరకూ మద్యం దుకాణాలకు కుదించారు. వాటిలోనూ ఉదయం 11 నుంచి సాయత్రం 8 గంటల వరకూ మాత్రమే లిక్కరు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో గత 44 రోజులుగా మధ్యం షాపులకు తాళాలు వేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో సోమవారం నుంచి లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి. అటుపై షాపుల ముందు జనాలు కీలో మీటర్ల మేర ఎలా బారులు తీరారా? తెలిసిందే? అదనంగా 25 శాతం ధరలు పెంచి నిన్న విక్రయాలు జరిపింది ప్రభుత్వం.
నిత్యావసర సరుకులకు కూడా ఇంత పెద్ద క్యూ రాష్ర్టంలో ఎక్కడా లేదని నిన్నటి సన్నివేశాలు చెప్పకనే చెప్పాయి. రాష్ర్టం మత్తు విషయంలో ఎంత వేగంగా ఉందో అందరికీ అర్ధమైంది. అయితే తాజాగా మద్యంపై మరో 50 శాతం అదనంగా ధరలు పెంచుతూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే మొత్తంగా 75 శాతం పెరిగిన కొత్త ధరలతో మద్యం విక్రయాలు జరగాల్సి ఉంది. దీంతో మరోసారి మద్యం ప్రియులకు షాక్ తగిలినట్లు అయింది. నిన్నటి రోజున మద్యం ప్రియుల షాపుల ముందు వరుస కట్టడంపై….అంటు వ్యాధి సమయంలో లాక్ డౌన్ ఉన్నప్పుడు షాపులు పున ప్రారంభించడంపై కొంత వ్యతిరేకత అయితే వ్యక్తమైంది.
ప్రతి పక్షాల విమర్శలు కొట్టి పారేయడానికి లేదు. అయితే ఇక్కడ జగన్ వ్యూహంపై రకరకలా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 25 శాతం ధరలు పెంచినా జనాలు వరుస కట్టారు? గంటల కొద్ది లైన్ లో నిలబడని తమకు కావాల్సిన అమృతాన్ని కొనుక్కుని వెళ్లారు. తాజాగా మరో 50 శాతం పెంచారు కాబట్టి ఎంతొ కొంత తగ్గుముఖం పడతారన్నది ఓ అంచనా. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ జరిగిన మద్యం అమ్మకాల గాణాంకాలు పరిశీలిస్తే మార్పుకు కొంత వరకూ దోహదం చేసాయని తెలుస్తోంది. ఏరులై పారే మద్యం ఇప్పుడు విచ్చల విడిగా రాష్ర్టంలో ఎక్కడా అమ్మకాలు జరగలేదు. ఓ పద్దతి ప్రకారం టైమ్ టు టైమ్ విక్రయాలు జరుగుతున్నాయి. తాగాలి అన్న యావను కొంత వరకూ జగన్ ప్రభుత్వం అదుపులోకి తీసుకొచ్చింది. మందు బాబులు ముఖ్యమంత్రి పై కారాలు మిరియాలు నూరినా! మంచి పనే చేసాడు అని స్వరం వినిపించినా వారు లేకపోలేదు.