జగన్ కు అరుదైన గౌరవం

జగన్మోహన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే మోస్ట్ పాపులర్ సిఎంల జాబితాలో మూడోస్ధానం దక్కించుకున్నారు. ’దేశ్ కా మూడ్’  పేరుతో  విడిపి అసోసియేట్స్ అనే సంస్ధ దేశవ్యాప్తంగా అందరు సిఎంల పనితీరపై  సర్వ జరిపింది.  ఈ సర్వేలో మొత్తం 14 మంది ముఖ్యమంత్రుల పనితీరును ప్రామాణికంగా తీసుకుంది సంస్ధ. అందులో జగన్ కు మూడోస్ధానం దక్కింది.

జగన్ అమల్లోకి తెస్తున్న ’నవరత్నాలు’ కార్యక్రమం పట్ల దేశవ్యాప్తంగా చాలామంది జనాలు ఆకర్షితులైనట్లు సర్వేలో తేలింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, సుపరిపాలనకు అమలు చేస్తున్న విధానాలు జనాల్లో నమ్మకం పెంచుతున్నట్లు ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.

ఈ సర్వేలో మొదటిస్ధానంలో ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలబడగా, తెలంగాణా సిఎం కెసియార్ కు ఐదోస్ధానం దక్కింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నవీన్ పట్నాయక్ దాదాపు 20 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇక కెసియార్ రెండోసారి సిఎం అయ్యారు. అంటే వారికి ముఖ్యమంత్రులుగా బాగానే అనుభవం ఉన్నది. కానీ జగన్ సిఎం అయి రెండు నెలలే అవటం గమనార్హం.