కార్పొరేట్ స్కూల్స్ ని తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలలో నూతన మార్పులకు జగన్ శ్రీకారం

Jagan explained the new policies to the authorities at mana badi nadu-nedu review meeting

ఆంధ్ర ప్రదేశ్: 2021-22 విద్యాసంవత్సరం నుంచి 1 నుండి 7వ తరగతి వరకూ సీబీఎస్‌ఈ విధానాన్ని అమలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మన బడి నాడు – నేడుపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌‌ దాస్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్రశిక్షా అభియాన్‌ ఎస్‌పిడి వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Jagan explained the new policies to the authorities at mana badi nadu-nedu review meeting
Jagan explained the new policies to the authorities at mana badi nadu-nedu review meeting

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘మొదటి దశ నాడు-నేడు పనులు మార్చికల్లా పూర్తి చేయాలి. స్కూళ్ళు కలర్‌ఫుల్‌గా మంచి డిజైన్లతో ఉండాలి. స్కూళ్ళలో ఇంటీరియర్‌ కూడా బావుండాలి. రెండో దశలో మరింత మార్పులు చేయాలి, విద్యార్ధులకు ఏర్పాటుచేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలి. పనుల్లో ఎక్కడా నాణ్యతా లోపం రాకూడదు. మనసా వాచా కర్మణ నిబద్ధతతో పనిచేయాలి. అప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధిస్తాం అన్నారు.ఎక్కడైతే భవనాలు లేవో.. అక్కడ కచ్చితంగా భవనాలు కట్టించాలి. నాడు – నేడులో భాగంగా ఆ పాఠశాలలన్నింటికీ భవన నిర్మాణాలు శరవేగంగా జరగాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు భవనాల నిర్మాణానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లలో టాయిలెట్ల శుభ్రతపై సీఎం సమీక్షించారు. ఇప్పటికే 27వేల మంది ఆయాలను నియమించామన్న అధికారులు… మార్చి మొదటివారంలో వీరందరికీ శిక్షణ కార్యక్రమాలు, పరికరాలు, పరిశుభ్రంగా ఉంచేందుకు లిక్విడ్స్‌ అన్నీ స్కూళ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్ధుల హాజరుకు సంబంధించి తల్లులు, ఎడ్యుకేషన్‌ సెక్రటరీలు, వాలంటీర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ నడుస్తోందని అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించడంతో.. మార్చి 15కల్లా పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.

విద్యాకానుకలో ఇంగ్లిషు – తెలుగు డిక్షనరీని చేర్చాలి. అలాగే పాఠ్యపుస్తకాలు కూడా క్వాలిటీగా ఉండాలి. ప్రైవేటు స్కూళ్లలో ఇస్తున్న పుస్తకాల నాణ్యతతో పోటీగా ఉండాలి. ఎక్కడా కూడా రాజీపడొదద్దు. టీచర్లకూ డిక్షనరీలు ఇవ్వాలి. అమ్మ ఒడి కింద ఆప్షన్‌ తీసుకున్న విద్యార్ధులకు ఇచ్చే ల్యాప్‌టాప్‌లు క్వాలిటీ, సర్వీస్‌ ముఖ్యమని జగన్ గుర్తు చేశారు. 2021– 22 విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 7వ తరగతి వరకూ సీబీఎస్‌ఈ విధానం అమలు చేయాలని సూచించారు. తర్వాత తరగతులకు ఒక్కో ఏడాదీ అమలు చేయాలన్నారు. 2024 విద్యా సంవత్సరానికల్లా 1 నుంచి 10 తరగతి వరకూ విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలోకి మారిపోవాలన్నారు.