వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడేపల్లి కార్యాలయంలో జరిగిన వైసిపి శాసనసభా పక్ష సమావేశంలో ఎంఎల్ఏలు జగన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి 149 మంది ఎంఎల్ఏలు హాజరయ్యారు.
వైసిపి శాసనసభా పక్ష నేతగా జగన్ ను ఎన్నుకుంటు సీనియర్ ఎంఎల్ఏ, మాజీ మంత్రి బొత్సా సత్యానారాయణ ప్రతిపాదించారు. మరో ఇద్దరు ఎంఎల్ఏలు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బలపరిచారు. దాంతో జగన్ ఎన్నికల ఏకగ్రీవమైనట్లే.
ఎంఎల్ఏల తీర్మానం కాపీనీ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ను కలిసి అందించనున్నారు. అందుకు శనివారం సాయంత్ర గవర్నర్ ను కలవటానికి మధ్యాహ్నం జగన్ తదితరులు విజయవాడ నుండి హైదరాబాద్ కు బయలుదేరుతున్నారు. దాంతో గవర్నర్ జగన్ ను సిఎంగా ప్రమాణ స్వీకారానికి సిద్ధం కావాలంటూ లాంఛనంగా ఆహ్వానిస్తారు.
30వ తేదీన సిఎంగా ప్రమాణ స్వీకారం చేయటానికి జగన్ సిద్ధమవుతున్నారు. కాకపోతే ప్రమాణ స్వీకారం చేసే వేదికను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. విజయవాడలోని మూడు వేదికలను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేని విధంగా వేదికను ఎంపిక చేయాలంటూ జగన్ ఇప్పటికే పార్టీ నేతలకు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశిలిచ్చారని సమాచారం.