Y.S.Jagan: అసెంబ్లీకి వైయస్ జగన్… జగన్ హాజరు వెనుక వ్యూహం అదేనా?

Y.S.Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. అయితే ఈయనకు ప్రతిపక్ష నేతగా హోదా లేకపోయినప్పటికీ అసెంబ్లీకి వెళ్లిన కేవలం ఒక ఎమ్మెల్యేగా వెళ్లి రావాల్సిందే తప్ప ప్రతిపక్ష నేత హోదాలో మాట్లాడే అవకాశం మాత్రం ఈయనకు ఉండదు అందుకని తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని అలా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినప్పుడే ప్రజల సమస్యలను నేను అసెంబ్లీలో తెలుపగలను అంటూ పలు సందర్భాలలో ఈయన స్పీకర్ ని కోరారు.

ఇక జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికలలో కేవలం 11 స్థానాలు మాత్రమే రావడంతో ఆయన ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోయారు. దీంతో ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే హాజరు కావాల్సి ఉంటుందని అధికార ప్రభుత్వ నేతలు చెప్పారు అయితే నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లబోతున్నారనే విషయం తెలిసే ఒకింత ఇతర పార్టీ నేతలు షాక్ అవుతున్నారు.

ఇక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వెళ్లినా కూడా ఆయనకు అవమానాలు తప్పవు అనే సంగతి తెలిసిందే. అలాగే మాట్లాడటానికి కనీసం మైక్ కూడా ఇవ్వరన్న సంగతి జగన్ కి తెలుసు అయినప్పటికీ కూడా జగన్ అసెంబ్లీ కి వెళ్లడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి అనేది మాత్రం అందరికీ సందేహంగా మారింది. ప్రతిపక్ష హోదా గురించి కూడా జగన్ అసెంబ్లీలో డిమాండ్ చేసే అవకాశం ఉందని సమాచారం. అసెంబ్లీలో ప్రతిపక్షం లేని నేపథ్యంలో ఈ డిమాండ్ వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉందని , కూటమి మాత్రం ఇందుకు నో చెప్పే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.జగన్ అసెంబ్లీకి వెళ్లడంతో ప్రజల మద్దతు పెరిగేలా ఆయన వ్యూహాలు ఉన్నాయని తెలుస్తోంది.జగన్ హాజరు అవుతున్న నేపథ్యంలో ఏపీ శాసన సభా సమావేశాలు ఒకింత హాట్ టాపిక్ కానున్నాయి. అసెంబ్లీకి వెళ్లే విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.