బీజేపీలోకి అచ్చెన్నాయుడు జంప్ అవుతున్నారా? టీడీపీకి గుడ్ బై చెప్పి! బిజేపీలో రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారా? అంటే అవుననే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇటీవలే ఈఎస్ ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అచ్చెన్నాయుడు సీరియస్ గా పోలిటికల్ కెరీర్ గురించి ఆలోచన చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ ఎస్ ఐ కుంభకోణం ఇప్పట్లో వదిలేదు కాదన్నది తెలిసిందే. ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. భవిష్యత్ లో ఎలాంటి టర్నింగ్ లు తీసుకుంటుందో కూడా తెలియదు. ఈ నేపత్యంలో అచ్చెన్నాయుడు సీరియస్ గా సేఫ్ జోన్ గురించి ఆలోచన చేస్తున్నట్లు లీకులoదాయి.
మరి ఇందులో నిజమెంతో ! అయితే ఈ విషయాలు తెలిసిన టీడీపీ జాతీయ కార్యదర్శి లొకేష్ అచ్చెన్న ఫ్యామిలీకి ఫోన్ చేసి మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇటీవలే అచ్చెన్నాయుడు కి టీడీపీ పార్టీ బాధ్యతల్ని చంద్రబాబు నాయుడు అప్పజెబుతున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ప్రస్తుతం పరిస్థితుల్లో పార్టీని నడిపించే సత్తా ఒక్క అచ్చెన్నాయుడికే ఉందని..అన్ని అర్హతలు ఆయనకు మాత్రమే ఉన్నాయని చంద్రబాబు భావించి బాద్యతలు ఇస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఇంతలోనే అచ్చెన్న మనసు బీజేపీ వైపు మళ్లుతోందని తెరపైకి వచ్చింది.
ఇక బీజేపీ నూతన సారథి సోము విర్రాజు కూడా ఉత్తరాంధ్రలో వైసీపీ వ్యతిరేక నాయకుల్ని టార్గెట్ చేసి పార్టీ కండువా కప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఏకంగా ఓ లిస్ట్ సిద్దం చేసుకుని ఇంటింటిని జల్లెడ పడుతున్నట్లు తెలిసింది. అలాగైతే బీజేపీకి జాక్ పాట్ తగిలినట్లే కదా. అచ్చెన్నాయుడు ఎలాగూ వైసీపీ చేరలేరు. ఆయన రాజీ పడినా అది జరిగే ప్రశక్తే లేదు. కాబట్టి అచ్చెన్నాయుడుకి ఇది మంచి అవకాశమే అనాలి. ఈ ఊపులోనే సోము వీర్రాజు అచ్చెన్న ఇంటి తలుపు తడితే కలిసొచ్చే అవకాశం ఉంది. మరి ఈఎస్ ఐ అభియోగాల నేపథ్యం కాబట్టి సోము వీర్రాజు అంత డేర్ చేస్తారా? అన్నది చూడాలి.