ఈ సీటులో ఇద్దరు అభ్యర్ధులూ ఏకమయ్యారా  ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. బహుశా రాష్ట్రం మొత్తం మీద బద్ద శతృవుల్లాంటి పార్టీలు ఏకమయ్యాయంటే అర్ధమేంటి ? ఏమిటంటే రెండు కలిసి మూడో పార్టీని ఓడించేందుకే అని. ఇంతకీ విషయం ఇంకా అర్ధం కాలేదా ? విశాఖపట్నంలో గాజువాక నియోజకవర్గం కూడా బాగా పాపులరైపోయింది.  ఇక్కడి నుండి ఇద్దరు లోకల్ అభ్యర్ధులు పోటీలో ఉంటే నాన్ లోకల్ గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటమే ప్రధాన కారణం.

మొన్నటి వరకూ వపన్ తో పాటు టిడిపి అభ్యర్ధి పల్లా శ్రీనివాస్, వైసిపి అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి పోటీలో ఉన్నారు. పవన్ తో పాటు ఇద్దరూ గట్టి అభ్యర్ధులే కావటంతో పోటీ ఉత్కంఠగా మారింది. అయితే, పవన్ ను గెలిపించటం కోసం పల్లాను గెలుపును త్యాగం చేయమని టిడిపిలో ముఖ్యనేత ఆదేశించారట అభ్యర్ధిని. ఎందుకంటే, సిట్టింగ్ ప్లస్ స్ట్రాంగ్ క్యాండిడేట్ పల్లా ఉంటే పవన్ గెలుపు అంత ఈజీ కాదట. దాంతో సొంత అభ్యర్ధే అయినా పర్వాలేదు త్యాగం చేయాల్సిందే అని చెప్పారట.

దాంతో ఏం చేయాలో పల్లాకు తోచలేదట. తాను గెలవనని అర్ధమైపోయిన పల్లా జనసేన అధినేత, నాన్ లోకల్ పవన్ కు సహకరించటం ఇష్టం లేక చివరకు వైసిపికి సహకరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మూడు రోజులుగా పల్లా తనకోసం పెద్దగా ప్రచారం చేసుకోవటం లేదట. తన మద్దతుదారులతో మాట్లాడుతూ వైసిపి గెలుపు కోసం కృషి చేయమని చెప్పారట.

అంటే ముఖ్యనేత ఒకటి ఆదేశిస్తే అభ్యర్ది తన మద్దతుదారులతో మరొటి చెప్పారనమాట. జిల్లా మొత్తం మీద టిడిపి యాదవులకు ఇచ్చిన సీటు గాజువాక మాత్రమే. అదికూడా ఇపుడు పవన్ కోసం త్యాగం చేయాలని చెప్పటంతో జిల్లాలోని మొత్తం యాదవులంతా టిడిపిపై మండిపోతున్నారట. పోలింగ్ మొదలైన తర్వాత ఓటింగ్ సరళిని బట్టికానీ అర్ధంకాదు ఇక్కడ ఏం జరుగుతోందో ?