నిమ్మగడ్డని జైలుకి పంపే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందా ?

Is the YCP government planning to send Nimmagadda to jail?

ఆంధ్రప్రదేశ్: జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డ మీద పగని ఎలాగైనా తీర్చుకునేదాకా వదిలిపెట్టేలా లేదు. వేసిన ఎత్తుగడలు,వ్యూహాలు పారకపోయినప్పటికీ కొత్త పన్నాగాలు పన్నుతున్నారని అర్ధమవుతుంది. ఇదే పంతంతో ఇప్పటికే కోర్టుల్లో ఎన్ని మొట్టికాయలు తిన్నా, ప్రభుత్వ పెద్దల తీరులో మార్పు వచ్చినట్టు లేదు. రాజ్యాంగ సంస్థ, రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు.ఈ నేపథ్యంలో చివరకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కోర్టు ధిక్కరణ పిటీషన్ కూడా దాఖలు చేసారు. అయితే వైసీపీ, ఎన్నికల కమీషనర్ దూకుడుకు షాక్ అవుతుంది. ఏ నిమిషాన ఏమి వస్తుందో, అనే టెన్షన్ అయితే ఉంది.

Is the YCP government planning to send Nimmagadda to jail?
Is the YCP government planning to send Nimmagadda to jail?

సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన దగ్గర నుంచి, ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావటంతో, ఎస్ఈసి దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ప్రభుత్వంలో మంత్రులు ,నిమ్మగడ్డను పర్సనల్ గా టార్గెట్ చేసారు. పెద్దిరెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా, నిమ్మగడ్డ మా దొడ్లో కట్టేసే ఎద్దులతో సమానం అని, విజయసాయి రెడ్డి నిమ్మగడ్డకు మెంటల్ అని కించపరుస్తూ మాట్లాడారు. దీంతో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సా, విజయసాయి, సజ్జలపై, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. గవర్నర్ యాక్షన్ తీసుకోకుంటే తాను కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుందని తెలిపారు.

మరోపక్కన నిమ్మగడ్డ మా హక్కులకు భంగం కలిగించారు అంటూ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సా, స్పీకర్ కు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ని సీరియస్ గా తీసుకున్న స్పీకర్ తమ్మినేని వెంటనే రియాక్ట్ అయ్యారు. చర్యల కోసం ప్రివిలైజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సిఫార్సు చేసారు. అయితే ఇంత వేగంగా స్పందించటం వెనుక ప్రభుత్వం, వేరే ప్లాన్ లో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

2008లో మహరాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను, ఇలాగే సభా హక్కుల నోటీస్ ఇచ్చి, రెండు రోజులు జైల్లో పెట్టిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు. ప్రివిలేజ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వమని నోటీసులు ఇచ్చారు. అయితే హాజరు అవ్వాల్సిన అవసరం లేదు అని ఎన్నికల కమిషనర్ సమాధానమిచ్చాడు. దీంతో 2008లో ఎన్నికల కమిషనర్ ని రెండు రోజులు జైలుకు పంపాలని ప్రివిలేజ్ కమిటీ లో తీర్మానించారు. అలా ఏమైనా నిమ్మగడ్డ పై చర్యలు తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది.