వైసిపిలోకి టిడిపి సీనియర్ నేత..ఒంగోలు ఎంపిగా పోటీ ?

తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత కరణం బలరామ్ తొందరలో వైసిపిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలో సినియర్ నేతే అయినా ప్రస్తుతం టిడిపిలో ఇమడలేకున్నారు. ఎందుకంటే, జిల్లా పార్టీ నేతల్లో అత్యధికులు కరణంకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కరణం మాటంటే అందరూ ఈక క్రింద తీసేస్తున్నారు. దానికితోడు రెండు రోజుల క్రిందట జిల్లాకు వచ్చిన చంద్రబాబునాయుడు వల్ల కరణానికి ఘోర అవమానం ఎదురైంది. దాంతో జరిగిన అవమానాన్ని కరణం తట్టుకోలేకున్నారు. ఒంగోలు పార్లమెంటు స్ధానం నేతలతో జరిగిన సమీక్షా సమావేశంలోకి కరణాన్ని చంద్రబాబు అలోవ్ చేయకపోవటం జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

వైసిపి తరపున పోయిన ఎన్నికల్లో గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టిడిపిలోకి ఫిరాయించటమే కరణం సమస్యలకు ప్రధాన కారణమైంది. గొట్టిపాటి టిడిపిలోకి వచ్చిన దగ్గర నుండి  కరణం మాట ఎక్కడా చెల్లుబాటు కావటం లేదు. దానికితోడు కరణంతో ఉన్న 40 ఏళ్ళ అనుబంధాన్ని కూడా చంద్రబాబు పక్కనపెట్టేసి గొట్టిపాటికే మద్దతుగా నిలవటం పుండుమీద కారం రాసినట్లైంది. దాంతో పార్టీలో తన పరిస్ధితేంటో కరణంకు బాగా అర్ధమైపోయింది. అందుకనే తెలుగుదేశంపార్టీ నుండి బయటకు వచ్చేసేందుకు ఆలోచిస్తున్నారు.

టిడిపిలో కరణం పరిస్దితిని గమనించిన వైసిపి నేతలు టచ్ లోకి వెళ్ళారు. కరణం కూడా వైసిపిలోకి వచ్చేసేందుకు రెడీగానే ఉన్నారు. అయితే, రెండు వైపులా డిమాండ్లు తెరపైకి వచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో అద్దంకి అసెంబ్లీతో పాటు ఒంగోలు పార్లమెంటు స్ధానాన్ని కరణం కోరుతున్నట్లు తెలిసింది. పార్లమెంటుకు తాను పోటీ చేయాలని, అద్దంకిలో తన కొడుకు వెంకటేష్ పోటీ చేయాలని కరణం పట్టుదలగా ఉన్నారు. అయితే, అందుకు జగన్ సానుకూలంగా లేరట. ఏదో ఒక టిక్కెట్టు మాత్రం ఇవ్వగలమన్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కరణం ముందు తన ఎంఎల్సీ స్ధానానికి రాజీనామా చేస్తేనే వైసిపిలో చేర్చుకుంటానని చెప్పినట్లు సమాచారం. సో నిర్ణయం ఏదైనా కరణం మాత్రం ఎంతోకాలం తెలుగుదేశంపార్టీలో కొనసాగే అవకాశాలైతే కనబడటం లేదు.  

తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత కరణం బలరామ్ తొందరలో వైసిపిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలో సినియర్ నేతే అయినా ప్రస్తుతం టిడిపిలో ఇమడలేకున్నారు. ఎందుకంటే, జిల్లా పార్టీ నేతల్లో అత్యధికులు కరణంకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కరణం మాటంటే అందరూ ఈక క్రింద తీసేస్తున్నారు. దానికితోడు రెండు రోజుల క్రిందట జిల్లాకు వచ్చిన చంద్రబాబునాయుడు వల్ల కరణానికి ఘోర అవమానం ఎదురైంది. దాంతో జరిగిన అవమానాన్ని కరణం తట్టుకోలేకున్నారు. ఒంగోలు పార్లమెంటు స్ధానం నేతలతో జరిగిన సమీక్షా సమావేశంలోకి కరణాన్ని చంద్రబాబు అలోవ్ చేయకపోవటం జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

వైసిపి తరపున పోయిన ఎన్నికల్లో గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టిడిపిలోకి ఫిరాయించటమే కరణం సమస్యలకు ప్రధాన కారణమైంది. గొట్టిపాటి టిడిపిలోకి వచ్చిన దగ్గర నుండి  కరణం మాట ఎక్కడా చెల్లుబాటు కావటం లేదు. దానికితోడు కరణంతో ఉన్న 40 ఏళ్ళ అనుబంధాన్ని కూడా చంద్రబాబు పక్కనపెట్టేసి గొట్టిపాటికే మద్దతుగా నిలవటం పుండుమీద కారం రాసినట్లైంది. దాంతో పార్టీలో తన పరిస్ధితేంటో కరణంకు బాగా అర్ధమైపోయింది. అందుకనే తెలుగుదేశంపార్టీ నుండి బయటకు వచ్చేసేందుకు ఆలోచిస్తున్నారు.

టిడిపిలో కరణం పరిస్దితిని గమనించిన వైసిపి నేతలు టచ్ లోకి వెళ్ళారు. కరణం కూడా వైసిపిలోకి వచ్చేసేందుకు రెడీగానే ఉన్నారు. అయితే, రెండు వైపులా డిమాండ్లు తెరపైకి వచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో అద్దంకి అసెంబ్లీతో పాటు ఒంగోలు పార్లమెంటు స్ధానాన్ని కరణం కోరుతున్నట్లు తెలిసింది. పార్లమెంటుకు తాను పోటీ చేయాలని, అద్దంకిలో తన కొడుకు వెంకటేష్ పోటీ చేయాలని కరణం పట్టుదలగా ఉన్నారు.

అయితే, అందుకు జగన్ సానుకూలంగా లేరట. ఏదో ఒక టిక్కెట్టు మాత్రం ఇవ్వగలమన్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కరణం ముందు తన ఎంఎల్సీ స్ధానానికి రాజీనామా చేస్తేనే వైసిపిలో చేర్చుకుంటానని చెప్పినట్లు సమాచారం. దానికితోడు ఈమధ్యే వైసిపి ముఖ్యనేత  బాలినేని శ్రీనివాసుల రెడ్డితో బలరామ్ కొడుకు కరణం వెంకటేష్ భేటీ అయ్యారు. దాంతో కరణం ఎంతోకాలం తెలుగుదేశంపార్టీలో కొనసాగే అవకాశాలు లేవని ప్రచారం ఊపందుకుంది.