చంద్రబాబు భవిష్యత్ చెబుతున్న సుజనా

చూడబోతే అలాగే ఉంది సుజనా చౌదరి చేసిన ప్రకటన. ఆత్మీయ సమావేశంలో కేంద్ర మాజీమంత్రి సుజనా మాట్లాడుతూ చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అవినీతిపై నిజాయితీగా విచారణ జరిపితే ఏమవుతుందో అని సుజనా చేసిన వ్యాఖ్యలు టిడిపిలో కలకలం రేపుతోంది.

నిజానికి చంద్రబాబుకు సుజనా ఎంతటి సన్నిహితులో అందరికీ తెలిసిందే. చంద్రబాబు బినామీలని ప్రచారంలో ఉన్నవారిలో సుజనా కూడా ఒకరు. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర ఓటమి తర్వాత సుజనా బిజెపిలోకి ఫిరాయించారు. ఆయన ఫిరాయించటమే కాకుండా మరికొందరు నేతలను కూడా బిజెపిలోకి లాగేస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఆదివారం జరిగిన చేరికల సందర్భంగా సుజనా మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిన విషయం తాను చెప్పలేనుకానీ పాలన మొత్తం గాడి తప్పిందన్నారు. చంద్రబాబు హయాంలో అవినీతి ఏ స్ధాయిలో అవినీతి కంపు కొట్టిందో అందరకీ తెలిసిందే. అందుకే గడచిన ఐదేళ్ళలో జరిగిన పనులు, కాంట్రాక్టులపై విచారణకు జగన్ ఆదేశించారు.

ఆ విషయాన్ని సుజనా ఇపుడు ప్రస్తావించారంటే అర్ధం ఏమిటి ? ఒకవైపు బిజెపి నేతలేమో చంద్రబాబు రెండేళ్ళల్లో  జైలుకెళ్ళటం ఖాయమంటున్నారు. అదే సమయంలో నిజాయితీగా విచారణ జరిగితే ఏమవుతుందో చెప్పలేనంటే అర్ధమేంటి ?  చేసిన అవినీతిపై చంద్రబాబు జైలుకెళ్ళటం ఖాయమని పరోక్షంగా జోస్యం చెప్పటమేనా ?