సుజనా మరీ అంత మాయగాడా ? 9 దేశాల్లో 40 షెల్ కంపెనీలా ?

తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు, చంద్రబాబునాయుడు బినామీగా ప్రచారంలో ఉన్న వ్యక్తి  సుజనాచౌదరి పెద్ద మాయగాడుగానే కనిపిస్తున్నాడు. కంపెనీలకు అవసరమంటూ వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకోవటం తర్వాత వాటిని ఎగొట్టటం ఆయన ప్లాన్ గా కనిపిస్తోంది. అంటే రుణాలు ఎగ్గొట్టే ఉద్దేశ్యంతోనే బ్యాంకుల నుండి వేల కోట్లు తీసుకుంటున్నట్లు అర్దమవుతోంది. మరి తీసుకున్న వేల కోట్ల రూపాయలంతా ఏమవుతోంది ? ఏమవుతోందంటే జగన్ మీడియా ప్రకారం విదేశాలకు తరలి వెళ్ళిపోతోందట. మళ్ళ అక్కడి నుండి దొడ్డిదోవన దేశంలోకి తర్వాత సుజనాతో పాటు ఆయన అనుకున్న వాళ్ళ ఖాతాల్లోకి చేరుతోందట.

 

జగన్ మీడియా ప్రకాకం సుజనా బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగొట్టిన మొత్తం సుమారు రూ 9500 కోట్లు. ఆ మొత్తం 9 విదేశాలకు తరలిపోయింది. బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్స్, కెమెన్ ఐల్యాండ్స్, సెంట్రల్ అమెరికా, దుబాయ్, హాంకాంగ్, ఐల్ ఆఫ్ మ్యాన్, మారిషస్, సింగపూర్, సెషల్స్, యుఏఇ దేశాల్లో దాదాపు 40 డొల్ల కంపెనీలు పెట్టారట. ఆ కంపెనీల్ల్ తనకు నమ్మకస్తులైన వారిని ఏదో ఓ పోస్టులో పెట్టుకుని వ్యవహారాలు నడిపిస్తున్నారు.

 

పై 40 కంపెనీలు కూడా సుజనా యూనివర్సల్స్, సుజనా టవర్స్ లిమిటెడ్, సుజనా  మెటల్  ప్రాడక్ట్స్ లిమిటెడ్ కు అనుబంధంగా పనిచేస్తున్నాయి. అంటే చాలా వరకూ ఈ డొల్ల కంపెనీలు చేసే వ్యాపారాలు ఏమీ ఉండవు. పై మూడు ప్రధాన కంపెనీల నుండి వచ్చిన డబ్బును అటు ఇటు మార్చి మళ్ళే దేశంలోకి పంపేయటమే పని.

 

సుజనా తీసుకున్న వేల కోట్లు ఎగవేసినా ఎందుకు ఏ బ్యాంకు కూడా ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుగా ప్రకటించలేదు ? ఎందుకంటే, సుజనాకున్న రాజకీయ మద్దతే. మొన్నటి వరకూ కేంద్రంలో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. తర్వాత ఏమి చేసినా కాపాడేందుకు అసలు సూత్రదారులు ఉండనే ఉన్నారు కదా ? అందుకే అంత ధైర్యంగా వేల కోట్లరూపాయలు ఎగొట్టగలిగారు. ఇదే చంద్రబాబు ఒకపుడు నీవర్ మోడిని, విజయమాల్యాను ఎన్ని మాటలన్నారో అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి వాళ్ళు చేసిన పనే సొంత మనిషి సుజనా చౌదరి చేస్తే నోరెందుకు మెదపటం లేదు ?