పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఈ ఎన్నికల్లో పూర్తి స్దాయిలో పరాజయం పొందిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని, పార్టీ పూర్తిగా మాతబడినట్లే అని ప్రచారం ప్రారంభించారు. అయితే దానికి ఆయన కౌంటర్ అన్నట్లుగా తన కార్యకర్తలతో మీటింగ్ లు పెట్టి సమీక్షలు జరిపారు. వచ్చే ఎలక్షన్స్ నాటికి పార్టిని పూర్తిగా బలోపేతం చేద్దామని ధైర్యం చెప్పారు. దాంతో ఓ వర్గం ఇరకాటంలో పడింది. పవన్ సినిమాల్లోకి వెళ్లిపోతాడు అని అనుకుంటే మళ్లీ ఇలా రాజకీయాలు అంటున్నాడేంటి ఆశ్చర్యపోయారు. ఓ అవగాహనకు రాలేకపోయారు.
దాంతో ఆయన్ని దెబ్బ కొట్టడానికి అన్నట్లుగా …పవన్ కళ్యాణ్ సినిమా ఎంట్రీకు భారీ ఎత్తున ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. అదీ పవన్ కు సినిమాలు చేయాలని ఉందని, ఈ ఐదేళ్లు ఖాలీగా ఉండటం ఎందుకని ఆయన అనుకుంటున్నారని మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే డైరక్ట్ గా పవన్ సినిమా ఎంట్రీ ఇస్తే బాగోదు కాబట్టి ఆయన అభిమానులు చేత…పవన్ రాజకీయాల్లోకి రావాలని గట్టిగా అనిపించేలా చేయాలని అందుకోసం ఓ ఉద్యమం లాంటిది నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.
అభిమానుల ఒత్తిడి మేరకే పవన్ తిరిగి సినిమాల్లోకి వచ్చారని చెప్పడానికి ఈ ఎత్తుగడను వేస్తున్నట్లు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ సినిమాల్లోకి రాను..పూర్తిగా రాజకీయాలకే పరిమితం అని క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇలాంటి వార్తలతో ఆయన్ను, ఆయన పార్టీని బ్యాడ్ చేయాలనుకోవటం మాత్రం దారణం. అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారు అని ప్రశ్నించవచ్చు. అందుకు పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. మీడియాను కొద్దిగా అబ్జర్వ్ చేస్తే చాలు. తెలిసిపోతుంది.