Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. 2024 లో జరిగిన ఎన్నికలలో భాగంగా ఈయన పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు అయితే కూటమి పార్టీలు ఎన్నికలలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇకపోతే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈయన కూడా అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని అందరూ భావించారు కానీ పొత్తు కారణంగా ఆ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇలా తనకు ఏ పదవి లేకపోయినా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ ఎన్నో త్యాగాలు చేశారు. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు ఉన్నత హోదా ఇప్పించాలని ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే తన అన్నయ్య నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో మంత్రి పదవిని ఇప్పించబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు మంత్రి పదవి ఇప్పించబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా వారసత్వ రాజకీయాలు చేస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. అయితే ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించిన పవన్ కళ్యాణ్ కు తన అన్నయ్య మంత్రి పదవి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను వారసత్వ రాజకీయాలు చేయడం లేదని తెలిపారు. తన అన్నయ్య నాగబాబు స్థానంలో మరెవరున్న కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాకపోయినా వారికి ఇదే హోదా కల్పించే వాడినని తెలిపారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అన్నయ్య ఎన్నో త్యాగాలు చేశారు అందుకే తనకు రాజ్యసభకు పంపించాలని అనుకున్నాము అది కుదరకపోవటంతోనే ఏపీ క్యాబినెట్లో ఆయనకు చోటు కల్పిస్తున్నట్టు ఈ సందర్భంగా పవన్ క్లారిటీ ఇచ్చారు.
