వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పోటీ చేయబోతున్నారా ? జిల్లాలో ఇపుడీ ప్రశ్నే అందరినీ తొలిచేస్తోంది. ఎందుకంటే, దత్తత గ్రామం పేరుతో భువనేశ్వరి తరచూ పామర్రు మండలంలోని కొమరవోలు గ్రామంలో తిరుగుతున్నారు. గతంలో ఎప్పుడూ భువనేశ్వరి జనాల్లోకి వచ్చిన దాఖాల్లేవు. అభివృద్ధి పరంగా కొమరవోలును దత్తత తీసుకున్న తర్వాత రెగ్యుల్ గా ఆ గ్రామానికి వచ్చి వెళుతున్నారు. ఆ సందర్భంగానే ఎటూ వస్తున్నారు కాబట్టి పలువురు స్ధానిక నేతలతో కూడా టచ్ లో ఉంటున్నారు.
ఈ నేపధ్యంలోనే వచ్చే ఎన్నికల్లో భువనేశ్వరి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా అనే సందేహం కలుగుతోంది. నిజానికి భువనేశ్వరి రాజకీయ రంగం అరంగేట్రం లాగే కోడలు నారా బ్రాహ్మణి పోటీపైన కూడా బాగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భువనేశ్వరి విషయం చూస్తే వచ్చే ఎన్నికల్లో గుడివాడ ఎంఎల్ఏగా పోటీ చేస్తే బాగుంటుందని స్ధానిక నేతలు అనుకుంటున్నారు. ఎటూ టిడిపికి ఈ నియోజకవర్గంలో గట్టి నేతలు లేరు. ఆమధ్య నందమూరి బాలకృష్ణ పేరు వినిపించింది కానీ తర్వాత ఏమైందో మళ్ళీ వినిపించలేదు. ఎన్టీయార్ కూతురిగా భువనేశ్వరి పోటీ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని స్ధానికులు అనుకుంటున్నారు.
అదే సమయంలో విజయవాడ ఎంపిగా కూడా భువనేశ్వర ప్రచారంలో ఉంది. ఒకసారి బ్రాహ్మణి పోటీ చేస్తుందని, మరోసారి చంద్రబాబు సతీమణే పోటీ చేస్తారని టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎంపి కేశినేని నానిపై స్ధానిక నేతల్లో తీవ్ర అసంతృప్తి కనబడుతోందట. భువనేశ్వరి కానీ బ్రాహ్మణి కానీ పోటీ చేస్తే నేతల్లో అసంతృప్తి అన్నదే వినిపించదు. అందులోను భువనేశ్వరి కానీ బ్రాహ్మణి కానీ ప్రత్యక్ష రాజీయాల్లోకి వస్తే తప్పకుండా గెలుస్తారన్న నమ్మకం ఉంటే పోటీ చేయించకుండా చంద్రబాబు ఛాన్స్ వదిలేసుకుంటారా ?